డ్రాపౌట్స్‌ను అరికట్టాలి
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:35 AM
డివిజన్‌లో డ్రాపౌట్స్‌ను అరికట్టడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు.

సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): డివిజన్‌లో డ్రాపౌట్స్‌ను అరికట్టడానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. గురువారం కార్యాలయంలో విద్యాశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ వెల్పేర్, కెజీబీవీ హాస్టల్ అధికారులతో సమక్షా సమావేశం నిర్వహించారు. పదో తరగతి పరీక్షలకు గైర్హాజరైన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్వీర్ణులయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డివిజన్‌లో ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టళ్లను మండల విద్యాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎల్పీవో నూర్జహాన్, డీప్యూటీ డీఈవో వెంకటరమణ రెడ్డి, బీసీ వెల్ఫేర్ అఽధికారి రాజ కుళ్ళాయప్ప పాల్గొన్నారు.