పైప్‌లైన లీకేజీలకు మరమ్మతులు చేపట్టండి
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:50 AM
గరంలో పైప్‌లైన లీకేజీలు ఏర్పడితే జాప్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేపట్టా లని కార్పొరేషన కమిషనర్ రవీంద్రబాబు అధికారులను ఆదే శించారు.

కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): నగరంలో పైప్‌లైన లీకేజీలు ఏర్పడితే జాప్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేపట్టా లని కార్పొరేషన కమిషనర్ రవీంద్రబాబు అధికారులను ఆదే శించారు. మంగళవారం ఆయన వీకర్ సెక్షన కాలనీ, పెద్దపాడుతో పాటు నగరం లోని పలు ప్రాంతాలలో పైప్‌లైన లీకేజీలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పైప్‌లైన లీకే జీలు ఏర్పడితే అక్కడి స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. నీటి వృథాను అరిక ట్టేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట డీఈఈ నరేష్, ఏఈ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వర్క్ ఇన్సపెక్టర్ కేశవ్ ఉన్నారు.