Share News

చట్ట ప్రకారం న్యాయం చేస్తాం : ఎస్పీ విక్రాంత్‌

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:50 PM

స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి.

చట్ట ప్రకారం న్యాయం చేస్తాం : ఎస్పీ విక్రాంత్‌
ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 94 ఫిర్యాదులు

కర్నూలు క్రైం, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : స్థానిక కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 94 ఫిర్యాదులు వచ్చాయి.

క్రిష్ణవర్ష పొదుపు సంఘంలో రూ.8 లక్షలు తీసుకున్నావ. ప్రతినెలా కంతులు కట్టించుకున్నారు. పొదుపు సంఘంలోని లీడర్లయిన సభ్యులు బ్యాంకుకు డబ్బులు కట్టకుండా మోసం చేశారని, బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయని కర్నూలు నిర్మల్‌నగర్‌కు చెందిన పల్లవి, రషీద, విజయలక్ష్మి, ఇతర సభ్యులు ఫిర్యాదు చేశారు.

తన పెద్ద కుమారుడు ఇల్లు రాసి ఇవ్వాలని ఇంటి, కుళాయి పన్నులు కట్టకుండా ఇంటి పట్టాలు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు కొత్తపేటకు చెందిన సుంకులమ్మ ఫిర్యాదు చేశారు.

ఇరిగేషన్‌ డిపార్టుమెంటులో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కర్నూలుకు చెందిన సూర్యమాధవరావు రూ.6.50 లక్షలు తీసుకొని మోసం చేశాడని కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

వాటర్‌ ప్లాంట్‌ ఫిట్టింగ్‌ చేస్తానని చెప్పి రూ.లక్ష తీసుకుని కర్నూలుకు చెందిన వారిష వాటర్‌ టెక్స్‌ మున్నా మోసం చేశాడని కర్నూలు మద్దూరునగర్‌కు చెందిన రామ్మూర్తి ఫిర్యాదు చేశారు.

కోడుమూరు వెంకటగిరిలో ఉన్న రెండున్నర ఎకరాల పొలాన్ని రంగమ్మ డబ్బులు తీసుకుని అమ్ముకుంది. మనుమడు గిడ్డయ్య ఆమెను రిజిస్టర్‌ చేయనీయకుండా మోసం చేస్తున్నాడని కర్నూలుకు చెందిన అంజినమ్మ ఫిర్యాదు చేశారు.

పట్టాభి రామయ్య కుటుంబ అవసరాల కోసం డబ్బులు తీసుకొని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కర్నూలు సంతోష్‌నగర్‌కు చెందిన రహీంబీ ఫిర్యాదు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులు న్యాయం చేసి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తానని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ హుశేన్‌పీరా, సీఐలు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:50 PM