Share News

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు సరికాదు: సీపీఎం

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:07 AM

ప్రజలపై విద్యుత్‌ భారం తగదని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు సరికాదని, ట్రూ అఫ్‌ చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు రణధీర్‌, సుధాకర్‌ డిమాండ్‌ చేశారు.

స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు సరికాదు: సీపీఎం
ఆత్మకూరులో విద్యుత్‌ అధికారికి వినతి పత్రం అందజేస్తున్న సీపీఎం నాయకులు

ఆత్మకూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ప్రజలపై విద్యుత్‌ భారం తగదని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు సరికాదని, ట్రూ అఫ్‌ చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు రణధీర్‌, సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణ శివార్లలోని విద్యుత్‌ శాఖ కార్యాలయం ఎదుట ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం విద్యుత్‌ శాఖ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. నాయకులు వీరన్న, సురేంద్ర, కిరణ్‌, మల్లయ్య, మహ్మద్‌, అంబయ్య, నాగేంద్రబాబు ఉన్నారు.

నందికొట్కూరు: ప్రజలపై విద్యుత్‌ భారం తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలోని విద్యుత్‌శాఖ ఏడీ కార్యాలయం ముందు విద్యుత్‌ ప్రైవేటీకరణ, విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ శెఖి ఒప్పందంతో విద్యుత్‌ చార్జీలను పెంచుతూ పేద ప్రజల రక్తాన్ని కూటమి ప్రభుత్వం పీల్చుతోందని మండిపడ్డారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఏడీ శ్రీనివాసులు, ఏఈ నాయక్‌కు వినతిపత్రం సమర్పించారు. సీపీఎం నాయకులు పక్కీర్‌సాహెబ్‌, కర్ణ, గోపాలకృష్ణ, శ్రీనివాసులు, నాగన్న, బాబుకొంగర, వెంకటేష్‌, మధు బాబు నాయుడు, అబ్దుల్‌ రషీద్‌, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:07 AM