Share News

Musk to Quit Doge: ట్రంప్ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పనున్న ఎలాన్ మస్క్?

ABN , Publish Date - Mar 29 , 2025 | 08:33 PM

అమెరికా ప్రభుత్వ వృథా ఖర్చులకు కళ్లెం వేశాక తన పని ముగిసినట్టే అని మస్క్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

Musk to Quit Doge: ట్రంప్ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పనున్న ఎలాన్ మస్క్?

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పొదుపు చర్యల విభాగం డోజ్ నుంచి ఎలాన్ మస్క్ తప్పుకోనున్నారా? తాజా ఇంటర్వ్యూలో మస్క్ వ్యాఖ్యలను చూస్తే ఇదే సందేహం కలుగుతుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తన లక్ష్యానికి చేరువలో ఉన్నానని మస్క్ పేర్కొనడం ప్రస్తుతం అమెరికాలో ఆసక్తికర చర్చకు దారి తీసింది.

టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత మస్క్ ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడికి సలహాదారుగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వ ఖర్చులు తగ్గించే దిశగా సూచనలు సలహాలు అందించే డోజ్ శాఖకు మస్క్ నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకూ డోజ్ శాక సాధించిన పురోగతిపై మస్క్ ఫాక్స్ న్యూస్‌లో పలు వివరాలు వెల్లడించారు. తన పని దాదాపుగా ముగిసినట్టేనని చెప్పుకొచచారు.


Also Read: భూకంప బాధితులకు సహాయం చేయడంలో భారత్ ఫస్ట్

ట్రిలియన్ డాలర్ల మేర ప్రభుత్వ ఖర్చును 130 రోజుల్లో తగ్గించే పని దాదాపుగా పూర్తైందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ టీమ్ చర్యలతో ప్రభుత్వానికి సగటున రోజుకు 4 బిలియన్ డాలర్ల మేరు పొదుపు అవుతున్నట్టు తెలిపారు. ‘‘వృథా, మోసపూరిత ఖర్చులను రోజుకు 4 బిలియన్ డాలర్ల మేర తగ్గించడమే మా లక్ష్యం. ఈ విషయంలో దాదాపుగా విజయం సాధించాము. ఈ పొదుపు చర్యలు లేకపోతే అమెరికా కొంప మునిగేదే’’ అని కామెంట్ చేశారు. దీంతో, మే నెలాఖరు కల్లా మస్క్ డోజ్ శాఖ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయన్న కామెంట్స్ వినబడుతున్నాయి.

మస్క్‌తో పాటు ఆ శాఖకు చెందిన టాప్ సిబ్బంది ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తాము చేపడుతున్న పలు చర్యల గురించి వివరించారు. ప్రభుత్వ సేవలపై ఎటువంటి ప్రభావం పడకుండా 15 శాతం మేర ఖర్చులు తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ నిర్వహణ సమర్థవంతంగా లేదని, వృథా ఖర్చులు పెరిగిపోయాయని అన్నారు. డోజ్ శాఖ చేపట్టిన సిబ్బంది తగ్గింపు, ఆస్తుల అమ్మకం, కాంట్రాక్టుల రద్దు తదితర చర్యలతో అమెరికా ఖజానాకు ఇప్పటివరకూ 115 బిలియన్ డాలర్ల మేర ఆదా అయ్యాయి.


Also Read: ఒక్కరికే దిక్కు లేదంటే.. ఒకే వేదికపై ఇద్దర్ని పెళ్లాడిన వ్యక్తి

అమెరికా ప్రభుత్వ పాలనలో మస్క్ జోక్యంతో ఆయన కంపెనీలపై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే. టెస్లా కార్ల అమ్మకాలు పడిపోయాయి. దేశవ్యాప్తంగా అనేక మంది టెస్లాను టార్గెట్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తనపై పని భారం పెరిగిందని ఇటీవల మస్క్ వ్యాఖ్యానించారు. మొత్తం 17 బాధ్యతలు నిర్వహిస్తు్న్నట్టు వెల్లడించారు. తన సంస్థలపై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయాన్ని కూడా ఆయన అంగీకరించారు.

Read Latest and International News

Updated Date - Mar 29 , 2025 | 08:35 PM