IPL 2025, GT vs MI: గుజరాత్ ఓపెనర్ల హవా.. పది ఓవర్లకు స్కోరు ఎంతంటే
ABN , Publish Date - Mar 29 , 2025 | 08:24 PM
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ (IPL 2025) మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్‌తో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ముంబై టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టీమ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. గుజరాత్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38), సాయి సుదర్శన్ (25 బంతుల్లో 38) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
ఇద్దరూ చూడ చక్కని షాట్లతో ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ఇద్దరూ దాదాపు 150 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నారు. ఈ జోడీని విడదీయడానికి ముంబై బౌలర్లు శ్రమించారు. చివరకు హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో నమన్ ధిర్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్ 10 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 92 పరుగులు చేసింది. సాయి సుదర్శన్‌తో పాటు జాస్ బట్లర్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఈ పిచ్ మీద 190-200 పరుగులు చేస్తే చాలా మంది స్కోరు అవుతుంది.