AP Midday Meal : జోన్లవారీగా భోజనం మెనూ
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:06 AM
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల వరకు ట్రయల్ రన్ అమలుచేస్తారు.

వేసవి సెలవుల వరకు పాఠశాలల్లో ట్రయల్ రన్
ప్రాంతీయ ఆహార అలవాట్లకు ప్రాధాన్యం
ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తదుపరి నిర్ణయం
పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో ఇకపై మెనూ జోన్ల వారీగా అమలుచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల వరకు ట్రయల్ రన్ అమలుచేస్తారు. చివర్లో అభిప్రాయాలు సేకరించి మార్పులపై నిర్ణయం తీసుకుంటారు. జోన్ 1లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు, జోన్ 2లో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్ 3లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్ 4లో ఉమ్మడి రాయలసీమ జిల్లాలు ఉంటాయి.
జోన్-1: సోమవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ; మంగళవారం-అన్నం, గుడ్డు కూర, రసం, రాగిజావ; బుధవారం- వెజ్ పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ; గురువారం- అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ; శుక్రవారం- పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, చిక్కీ; శనివారం- అన్నం, కూరగాయల కూర, రసం, రాగి జావ, స్వీట్ పొంగలి.
జోన్-2: సోమవారం-అన్నం, కూరగాయలు లేదా ఆకుకూర పప్పు, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ; మంగళవారం- పులిహోరా, ఉడికించిన గుడ్డు, చట్నీ, రాగిజావ; బుధవారం- అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ; గురువారం- కూరగాయల అన్నం లేదా వెజ్ పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ; శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ; శనివారం- అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, స్వీట్ పొంగలి, రాగి జావ.
జోన్-3: సోమవారం- అన్నం, సాంబారు, ఎగ్ ఫ్రై, చిక్కీ; మంగళవారం- పులిహోరా, టమాటా లేదా పుదీనా చట్నీ, ఫ్రైడ్ ఎగ్, రాగిజావ; బుధవారం- అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, ఎగ్ ఫ్రై, చిక్కీ; గురువారం- వెజిటబుల్ అన్నం లేదా పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగి జావ; శుక్రవారం- అన్నం, గుడ్డు కూర, చిక్కీ; శనివారం- అన్నం, టమాటా పప్పు లేదా పప్పుచారు, స్వీట్ పొంగలి, రాగి జావ.
జోన్- 4: సోమవారం- అన్నం, వెజిటబుల్ కర్రీ, గుడ్డు, చిక్కీ; మంగళవారం- పులగం లేదా పులిహోర, వేరుశెనగ చట్నీ, ఉప్పుకారంతో గుడ్డు, రాగిజావ; బుధవారం- అన్నం, సాంబారు, గుడ్డు, చిక్కీ; గురువారం- వెజిటబుల్ రైస్, గుడ్డు కూర, రాగిజావ; శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ; శనివారం- అన్నం, కందిపప్పుచారు, బెల్లం పొంగలి, రాగి జావ.
పాఠశాలల్లో మెంటార్ వ్యవస్థ
పూర్వ విద్యార్థులు, స్కూళ్ల అభివృద్ధి కాంక్షించే వారితో ఏర్పాటు
బడులు తెరిచే నాటికే విద్యార్థులకు కిట్లు
టీచర్లకు ఇకపై ఒకటే యాప్: మంత్రి లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పూర్వ విద్యార్థులు, పాఠశాలల అభివృద్ధిని కాంక్షించే వారితో పాఠశాలల్లో మెంటార్ల వ్యవస్థను రూపొందించాలని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రా మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్లూప్రింట్‌లో భాగంగా ఆ వ్యవస్థను తీసుకురావాలన్నారు. పాఠశాల విద్యాశాఖపై గురువారం ఉండవల్లిలోని నివాసంలో అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్షించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు విద్యార్థులకు అందాలన్నారు. టీచర్లకు ఇకపై ఒకే యాప్ ఉండాలన్నారు. టీచర్లు బోధన, హాజరు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల పెంపునకు ఎక్కువ సమయం కేటాయించాలన్నారు. పెద్ద పాఠశాలల్లో ఎస్టేట్ మేనేజర్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలన్నారు. పాఠశాల విద్యాశాఖ అన్ని అంశాలను ఏకీకృతం చేసేలా ఒకే డ్యాష్‌బోర్డు రూపొందించాలన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు క్రమంగా తగ్గే చర్యలు తీసుకోవాలన్నారు.