Share News

Minister Nara Lokesh: నాపై నమ్మకంతో కీలక బాధ్యతలిచ్చారు

ABN , Publish Date - Jan 22 , 2025 | 04:19 AM

‘సీఎం చంద్రబాబు నాపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారు.

Minister Nara Lokesh: నాపై నమ్మకంతో కీలక బాధ్యతలిచ్చారు

  • విద్యారంగంలో విప్లవాత్మక మార్పులను సీఎం కోరుకుంటున్నారు

  • వేరే ఆలోచనలకు తావు లేదు

  • ‘డిప్యూటీ’ ప్రచారంపై లోకేశ్‌ స్పష్టీకరణ

అమరావతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు నాపై నమ్మకంతో చాలా కీలక బాధ్యతలు అప్పగించారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ఆయన ఆశిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని, ఆశయాన్ని సాధించేందుకు క్షణం తీరిక లేకుండా శ్రమిస్తున్నా. ఇతర ఆలోచనలకు తావులేదు’ అని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నేతల నుంచి వస్తున్న డిమాండ్ల గురించి మంగళవారం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ పట్టణంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు లోకేశ్‌ పైవిధంగా స్పందించారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారని, రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కూటమి ప్రభుత్వం సాగిపోతోందని లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 08:42 AM

News Hub