Share News

Pastor Praveen Pagadala: ప్రభుత్వ దర్యాప్తుపై పూర్తి నమ్మకముంది

ABN , Publish Date - Apr 03 , 2025 | 04:22 AM

పాస్టర్ ప్రవీణ్‌ పగడాల మృతిపై రాజకీయ, మతపరమైన ప్రయోజనాలకు ఉపయోగించకూడదని ఆయన భార్య జెస్సికా, సోదరుడు కిరణ్‌ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని, అసత్య ప్రచారాలు నిలిపివేయాలని కోరారు.

 Pastor Praveen Pagadala: ప్రభుత్వ దర్యాప్తుపై పూర్తి నమ్మకముంది

అత్యుత్సాహంతో చేసే ‘సొంత దర్యాప్తు’లు ఆపండి

ప్రవీణ్‌ మృతిని రాజకీయాలకు వాడుకోకండి

మత సామరస్యాన్ని దెబ్బతీయకండి

పాస్టర్‌ ప్రవీణ్‌ సోదరుడు, సతీమణి వినతి

పడుతూ.. లేస్తూ.. వరుస ప్రమాదాలకు గురైన పాస్టర్‌ ప్రవీణ్‌

చిల్లకల్లు టోల్‌గేట్‌కు ముందే మరో ప్రమాదం.. తాజాగా వెలుగులోకి

అమరావతి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మరణాన్ని రాజకీయ, మతపరమైన ప్రయోజనాలకు వాడుకోవడం ఆపి వేయాలని ఆయన సతీమణి జెస్సికా పగడాల, సోదరుడు కిరణ్‌ కోరారు. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తుపట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. బుధవారం వారు వేర్వేరుగా దీనిపై వీడియో ప్రకటన విడుదల చేశారు. వివరాలు వారి మాటల్లోనే...

‘‘ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం సత్వరం స్పందించి పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. దీనికి మేం ధన్యవాదాలు చెబుతున్నాం. అయితే... అత్యుత్సాహంతో సొంత దర్యాప్తు చేస్తున్న వారందరికీ నా విన్నపం! మీ సొంత దర్యాప్తులు ఆపండి. ఇది... ప్రవీణ్‌ పగడాల ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. కొందరు యూట్యూబర్లు, బ్లాగర్లు ప్రవీణ్‌ పగడాల మరణంపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేస్తున్నారు. మరికొందరేమో ఆయన మరణాన్ని మతపరంగా, రాజకీయంగా వాడుకుంటున్నారు. ప్రవీణ్‌ పగడాలను గౌరవిస్తూ... ఇలాంటి చర్యలను ఆపివేయండి. ఆయన ఎప్పుడూ మత సామరస్యాన్నే కోరుకున్నారు. మేం ప్రభుత్వ దర్యాప్తును పూర్తిగా విశ్వసిస్తున్నాం. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని చెరిపివేయవద్దు.’’

- కిరణ్‌ (ప్రవీణ్‌ సోదరుడు)


‘‘మాకు మద్దతుగా నిలబడిన క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి సమయంలో మాకు మీ సహకారం అవసరం. ప్రవీణ్‌ పగడాల ఒక మంచి భర్త, మంచి తండ్రి! ఆయన భౌతికంగా లేరని తెలిశాక... మేం అనుభవిస్తున్న బాధను అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ప్రవీణ్‌ పగడాల మృతిపై ప్రభుత్వం వేగంగా స్పందించి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అందుకు మా ధన్యవాదాలు. ప్రభుత్వ దర్యాప్తుపై మాకు నమ్మకముంది. దయచేసి ఎవరూ మత సామరస్యాన్ని దెబ్బతీయవద్దు. నా భర్త మత సామరస్యాన్నే కోరుకున్నారు. దానిని దెబ్బతీయాలనే ఉద్దేశం ఆయనకు ఎన్నడూ లేదు.’’

- జెస్సికా (ప్రవీణ్‌ సతీమణి)


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 04:22 AM