బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజకు వేగంగా ఏర్పాట్లు
ABN , Publish Date - Mar 27 , 2025 | 02:25 AM
మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీలో వచ్చే నెల 2వతేదీన జరగనున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం రిలయన్స్‌కు కేటాయించిన 475.57ఎకరాలలో ముళ్లపొదల తొలగింపుతోపాటు భూమిని చదును చేశారు.

ముళ్లచెట్ల తొలగింపు.. భూమి చదును
రోడ్డు నిర్మాణం పూర్తి
విద్యుత్ లైన్ ఏర్పాటు
నిత్యం పర్యవేక్షిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర
పీసీపల్లి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వెంగళాయపల్లి పంచాయతీలో వచ్చే నెల 2వతేదీన జరగనున్న రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ భూమి పూజకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం రిలయన్స్‌కు కేటాయించిన 475.57ఎకరాలలో ముళ్లపొదల తొలగింపుతోపాటు భూమిని చదును చేశారు. పంచాయతీరాజ్ అధికారుల ఆధ్వర్యంలో మురుగుమ్మి నుంచి బయోగ్యాస్ భూమి వరకూ ఏర్పాటు చేస్తున్న రోడ్డు నిర్మాణం పూర్తయింది. విద్యుత్‌లైన్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే స్తంభాలు పాతారు. ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్నారు. కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పర్యవేక్షణలో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంటున్న ఎమ్మెల్యే ఉగ్ర సంబంధిత శాఖల అధికారులకు సూచనలు ఇస్తూ పనులు చేయిస్తున్నారు. బుధవారం ఆయన సభావేదిక, హెలిప్యాడ్‌లను ఏర్పాటు చేసే ప్రాంతాలను అధికారుల ద్వారా మార్కింగ్ గీయించారు. గురువారం నాటికి పనులన్నీ పూర్తిచేయించాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే వెంట రిలయన్స్ కాంట్రాక్టర్ బత్తిన రాధాకృష్ణ, వెంగళాయపల్లి సర్పంచ్ కరణం తిరుపతయ్య, విద్యుత్ ఈఈ ఉమాకాంత్, ఏఈ లక్ష్మీరాజేష్, పంచాయతీరాజ్ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ తిరుపాలయ్య, వివిధశాఖల అధికారులతోపాటు నాయకులు యారవ శ్రీనివాసులు, వీరపనేని పెద్దన్న, ఏనుగంటి చిన్నా,కృష్ణారెడ్డి, చినబ్రహ్మయ్య, ప్రసాదు తదితరులు ఉన్నారు.