Share News

గోల్డెన్‌ గ్రానైట్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:33 AM

గోల్డెన్‌ గ్రానైట్‌ మైనింగ్‌ రెన్యువల్‌ లీజు ను రద్దు చేస్తూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.

గోల్డెన్‌ గ్రానైట్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు

సింగిల్‌ జడ్జి తీర్పుని కొట్టివేసిన ద్విసభ్య ధర్మాసనం

మైనింగ్‌ కార్యకలాపాలకు తొలగిన అడ్డంకులు

చీమకుర్తి, మార్చి27(ఆంధ్రజ్యోతి) : గోల్డెన్‌ గ్రానైట్‌ మైనింగ్‌ రెన్యువల్‌ లీజు ను రద్దు చేస్తూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పు గోల్డెన్‌ గ్రానైట్‌కు అనుకూ లంగా రావటంతో మైనింగ్‌ కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి అడ్డంకులు తొలగిపోయాయి. మండలంలోని ఆర్‌ఎల్‌పురంలోని సర్వేనంబర్‌ 55/6లో గో ల్డెన్‌ గ్రానైట్స్‌కు మైనింగ్‌ లీజును పునరుద్ధరిస్తూ 2022 ఆగస్టు 17న గనులశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వీటిని రద్దు చేయాలంటూ బీఏఎస్‌ గ్రానైట్‌కు చెందిన అశ్వత్థనారాయణ, సురేష్‌కుమార్‌లు 2022లో హైకోర్టులో వా జ్యం దాఖలు చేశారు. దీనిపై 2025 ఫిబ్రవరి 21న హైకోర్టు సింగిల్‌ బెంచి జడ్జి మైనింగ్‌ పునరుద్ధరణ లీజును రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీనిపై గోల్డెన్‌ గ్రా నైట్‌ సంస్థ హైకోర్టు ద్విసభ్య జడ్జి ధర్మాసనానికి అప్పీల్‌ చేయగా విచారణ జరిపిన తదుపరి గురువారం సింగిల్‌జడ్జి తీర్పును కొట్టివేస్తూ తీర్చు ఇచ్చారు. మైనింగ్‌ లీజు పునరుద్ధరిస్తూ డైరెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వుల అమలులోకి రాగా కార్యకలాపాలు నిర్వహించుకొనే అవకాశం గోల్డెన్‌ గ్రానైట్‌కు లభించింది.

Updated Date - Mar 28 , 2025 | 12:33 AM