ఒంగోలులో తెలంగాణ పోలీసుల హడావుడి
ABN , Publish Date - Mar 23 , 2025 | 12:37 AM
ఒంగోలు లో తెలంగాణ పోలీసులు హడావుడి సృష్టించారు. ట్రంకు రోడ్డు చివరలో ఉన్న బీకే అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు.

ఓ అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు
నివాసితుల ఆందోళన
ఒంగోలు క్రైం, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు లో తెలంగాణ పోలీసులు హడావుడి సృష్టించారు. ట్రంకు రోడ్డు చివరలో ఉన్న బీకే అపార్ట్‌మెంట్‌లో శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. దీంతో అందులోని నివాసితులు భీతిల్లిపోయారు. స్థానిక పోలీసులకు సమాచారం అంది వారు రంగంలోకి రావడంతో గంటన్నర తర్వాత అక్కడ హడావుడి తగ్గింది. అందిన సమాచారం మేరకు.. తెలంగా ణ రాష్ట్రంలో ఒక చెక్కు బౌన్స్ కేసులో విజయ్‌కుమార్ అ నే వ్యక్తికి నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ అయ్యింది. కో ర్టు ఆదేశాల మేరకు ఆయన్ను అరెస్టు చేసేందుకు గాలిం పు చేపట్టిన తెలంగాణ పోలీసులకు విజయ్‌కుమార్ ఒం గోలులోని బీకే అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు సమాచారం అం దింది. దీంతో వారు శనివారం రాత్రి ఇక్కడికి చేరుకున్నా రు. విజయ్‌కుమార్ అందుబాటులో లేకపోగా పోలీసుల గాలింపుతో బీకే అపార్ట్‌మెంట్‌లోని నివాసితులంతా భీతి ల్లిపోయారు. వెంటనే వారు స్థానిక పోలీసులకు సమా చారం ఇచ్చారు. అదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సిబ్బంది కూడా ఫిర్యాదు చే శారు. దీంతో నగరంలోని పోలీసులు రంగంలోకి వచ్చి బీకే అపార్ట్‌మెంట్‌లో హడావుడి చేస్తున్న తెలంగాణ పో లీసులతో మాట్లాడారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దాడులు చేయడం సమంజసం కాదని చెప్పి అక్కడి నుంచి వారిని తీసుకెళ్లారు. గంటన్నర తర్వాత అ పార్ట్‌మెంట్‌లో పరిస్థితి చక్కబడింది.