Share News

బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమి పూజకు ముమ్మర ఏర్పాట్లు

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:13 PM

మండలంలోని వెంగళాయపల్లి పంచాయ తీలో నిర్మించనున్న బయోగ్యాస్‌ ప్లాంట్‌ ని ర్మాణానికి భూమి పూజకు ముమ్మర ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సూచనలతో సంబంధిత అధికారులు చకచకా పనులు చేయిస్తు న్నారు.

బయోగ్యాస్‌ ప్లాంట్‌ భూమి పూజకు ముమ్మర ఏర్పాట్లు
ఏర్పాట్లపై అధికారులకు సూచనలిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

వేగంగా విద్యుత్‌లైన్‌, రోడ్డు నిర్మాణం

పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి

పీసీపల్లి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని వెంగళాయపల్లి పంచాయ తీలో నిర్మించనున్న బయోగ్యాస్‌ ప్లాంట్‌ ని ర్మాణానికి భూమి పూజకు ముమ్మర ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి సూచనలతో సంబంధిత అధికారులు చకచకా పనులు చేయిస్తు న్నారు. ఇప్పటికే సుమారు 350ఎకరాలలో ముళ్లపొదలను తొలగించారు. దివాకరపల్లి నుంచి బయోగ్యాస్‌ ప్లాంట్‌కు కేటాయించి న భూమి వరకు రోడ్డు పనులు వేగవంత మయ్యాయి. విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో దివాకరపల్లి గ్రామంలో రోడ్డుకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలను తొలగించి పక్కన అమర్చారు. రిలయన్స్‌ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిన భూమి వరకు విద్యుత్‌ అ ధికారులు వడివడిగా విద్యుత్‌లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

సోమవారం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి, ఈవెంట్‌ నిర్వాహకులు మణిందర్‌, ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి తదితరులు ప్లాంట్‌ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. ఏప్రిల్‌ 2న జరిగే భూమిపూజకు వీఐపీలు రానున్న నేపథ్యంలో రెండు హెలిప్యాడ్‌ల నిర్మాణంతో పాటు బ హిరంగసభ నిర్వహించే ప్రాంతంలో భూమిని చదును చేయడంతో పాటు అవసరమైన రోడ్ల నిర్మాణం చేప ట్టాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర సంబంధిత అధికారులు, రిలయన్స్‌ ప్రతినిధులను ఆదేశించారు. సభావేదిక నుం చి 600మీటర్ల దూరంలో హెలిప్యాడ్‌లు నిర్మించాల న్నారు. వీఐపీల వాహనాలు వచ్చేందుకు మురుగుమ్మి నుంచి రోడ్డును ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ అధికారులను ఆదేశించారు. బహిరంగసభకు వచ్చే ప్రజలకు దివాకరపల్లి నుంచి రోడ్డుమార్గం ఏర్పాటు చేయడంతో పాటు ద్విచక్రవాహనాలు, కార్లకు వేరువేరు గా పార్కింగ్‌లు ఏర్పాటుచేయమని సంబంధిత శాఖ వారిని ఆదేశించారు.

రిలయన్స్‌ కంపెనీకి కేటాయించిన 475.57ఎకరాలలో సోమవారం రాత్రికి 350ఎకరాలకు పైగా భూమిలో ముళ్లపొదలను తొలగించి భూమిని చదునుచేశారు. ఎమ్మెల్యే ఉగ్ర వెంట సైట్‌ ఇన్‌చార్జ్‌ బత్తిన రాధాక్రిష్ణ, వెంగళాయపల్లి సర్పంచ్‌ కరణం తిరుపతయ్య, ఈవెంట్‌ నిర్వాహకులు మణిందర్‌, పంచాయతీరాజ్‌ డీఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ తిరుపాలయ్య, విద్యుత్‌శాఖ ఈఈ ఆర్‌.ఉమాకాంత్‌, ఏఈ లక్ష్మీరాజేష్‌, టీడీపీ మండల అధ్యక్షుడు వేమూరి రామయ్య, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పా ల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:13 PM