పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం భరోసా
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:31 AM
ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్య పరిస్థి తులలో సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్య మంత్రి సహాయనిధి ఒక భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు.

గిద్దలూరుటౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్య పరిస్థి తులలో సతమతమవుతున్న పేద ప్రజలకు ముఖ్య మంత్రి సహాయనిధి ఒక భరోసా ఇస్తుందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. సోమవారం నియోజకవర్గంలో అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న 37 మందికి సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 23,89,836లను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి మంజూరు చేయించి ఆ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ని యోజకవర్గంలోని ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తే తనకు తెలియచేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కొమరోలు, రాచర్ల, గిద్దలూరు మండల పార్టీల అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు, కటికె యోగానంద్, మార్తాల సుబ్బారెడ్డి, కేతం శ్రీనివాసులు, నరసిం హులు, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కంభం : చెత్త నుంచి సంపద సృష్టించే భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో ఘనవ్యర్థ పదార్థాల నుంచి ఎరువులను విద్యుత్ ఉత్పత్తి చేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహితంగా చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి రోజు ఒక్కో మండలం చొప్పున ఆయా పంచా యతీల కార్యదర్శులు, క్లాప్‌మిత్రల ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో వీరభద్రాచారి, జడ్పీటీసీ సభ్యులు కొత్తపల్లి జ్యోతి కంభం, కందులాపురం సర్పంచులు బోడయ్య, రజని, టీడీపీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాసులు, ఆరేపల్లి మల్లికార్జున, ఎస్సీసెల్ నాయకులు గోన చెన్నకేశవ రావు, కేతం శ్రీనివాసులు, ఈవోపీఆర్‌డీ విజయలక్ష్మి, నీటిసంఘం అధ్యక్షులు ఆదినారాయణ, బిజ్జాల కిశోర్ తదితరులు పాల్గొన్నారు.
కంభం : శనగ రైతులను ఆదుకునే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌యార్డుల ద్వారా శనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా కంభం మార్కెట్‌యార్డు ఆవరణలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కంభం, అర్ధవీడు మండలాలకు చెందిన రైతుల నుంచి కందులు, శనగలను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. క్వింటా శనగలు రూ.5650, క్వింటా కందులు రూ.7650 చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కావున శనగ, కందులు రైతులు ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ ఏడీఏ బాలాజీ నాయక్, ఏవో స్వరూపా, ఎంపీడీవో వీరభద్రాచారి, తహసీల్దార్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
పేదలకు దుస్తులు పంపిణీ
కంభం : రంజాన్ మాసం సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ నాయకులు రఫీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి చేతుల మీదగా 700 మంది పేదలకు దుస్తులు పంపిణీ చేయించారు. ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి మాట్లాడుతూ రఫీ ఏటా ఇలా పేదలకు నిత్యవసర సరుకులను, దుస్తులను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు.