కిచెన్ గార్డెన్, మిద్దె తోటలపై శిక్షణ
ABN , Publish Date - Mar 25 , 2025 | 01:27 AM
ఎర్రగొండపాలెం డివిజన్ పరిధిలోని రైతుసేవాకేంద్రం సిబ్బందికి, వ్యవసాయ సిబ్బందికి హోమ్ కంపోస్టింగ్‌పై సోమవారం శిక్షణ తరగతులను రైతుసేవా కేంద్రంలో నిర్వహిం చారు.

ఎర్రగొండపాలెం రూరర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : ఎర్రగొండపాలెం డివిజన్ పరిధిలోని రైతుసేవాకేంద్రం సిబ్బందికి, వ్యవసాయ సిబ్బందికి హోమ్ కంపోస్టింగ్‌పై సోమవారం శిక్షణ తరగతులను రైతుసేవా కేంద్రంలో నిర్వహిం చారు. అదనపు వ్యవసాయ సంచాలకురాలు కె.నీరజ అధ్వర్యంలో జరిగిన ఈ తరగతుల్లో డీటీసీ డీఆర్‌సీ ఎస్.రామ్మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల కంపోస్టు పిట్ల తయారీ, మిద్దె తోటలు పెంపకం తదితర వాటిపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్‌సీ, ఏడీఏ జె.వెంకట్రావు, డీఆర్‌సీ వ్యవసాయ అధికారులు వి.వెంకటశేషమ్మ, ఏ.శైలజరాణి, ఉద్యానశాఖ అధికారి పి.ఆదిరెడ్డి, నాలుగు మండలాల వ్యవసాఽయాధికారులు, రైతుసేవా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.