బీఆర్‌పీ రోడ్డు పార్కింగ్‌లో ప్రైవేటు వసూళ్లు
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:52 AM
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వన్‌టౌన్ బీఆర్‌పీ రోడ్డులో నిర్వహిస్తున్న పార్కింగ్‌లో ప్రైవేటు వ్యక్తులు వాహనదారుల నుంచి అధికంగా రుసు ము వసూలు చేస్తున్నారు.

వన్‌టౌన్, మార్చి 31 (ఆంధ్రజ్యో తి): నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో వన్‌టౌన్ బీఆర్‌పీ రోడ్డులో నిర్వహిస్తున్న పార్కింగ్‌లో ప్రైవేటు వ్యక్తులు వాహనదారుల నుంచి అధికంగా రుసు ము వసూలు చేస్తున్నారు. డ్యూటీలు ని ర్వహించాల్సిన వీఎంసీ ఎస్టేట్ సిబ్బంది సమీప ప్రాంతంలో ఇతరులతో కాలక్షేపం చేస్తూ కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. కొత్తపేటకు చెంది న ఓ కాంట్రాక్టర్ బీఆర్‌పీ రోడ్డు పార్కింగ్‌ను పాడుకొని వ్యక్తిగత కారణాలతో వదిలేశారు. ప్రస్తుతం కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్టేట్ సిబ్బంది వాహనదారుల నుంచి రుసుము వసూలు చేస్తున్నారు. పార్కింగ్‌లో కారు, ట్యాక్సీ పార్కింగ్ చే సినందుకు గంటకు రూ.30 చొప్పున వ సూలు చేయాలి. తరువాత ప్రతి 2 గం టలకు రూ.20 చొప్పున వసూలు చే యాలి. అయితే విధులు నిర్వహిస్తున్న ఎస్టేట్ సిబ్బంది బయటి వ్యక్తులను ని యమించుకుని రూ.30కు బదులు రూ .50 చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారు. వాహనదారులకిచ్చే రశీదుపై రూ.30కు బదులు రూ.50 అని పెన్ను తో దిద్ది మరీ వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇంతేనంటూ ప్రైవేటు వ్యక్తి రాము నిర్లక్ష్యంగా సమాధానం చె బుతున్నారు. ఇక్కడ డ్యూటీ నిర్వహిస్తు న్న ఎస్టేట్ ఉద్యోగి ఏసు తాను డ్యూటీ చేయకుండా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నాడు. అతడు మాత్రం ఇతరులతో కాలక్షేపం చేస్తున్నాడు. అధికారులు స్పందించి ప్రైవేటు వ్యక్తులు అ ధిక రుసుము వసూలు చేయటంపై త గిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.