Share News

Senior Citizen Health Insurance: వయో వృద్ధుల కోసం ‘పీఎంజేఏవై’

ABN , Publish Date - Apr 03 , 2025 | 05:33 AM

ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (PMJAY) కింద 70 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.5 లక్షల బీమా అందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వృద్ధులు PMJAY లేదా ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకాల్లో దేన్నైనా ఎంపిక చేసుకోవచ్చు.

Senior Citizen Health Insurance: వయో వృద్ధుల కోసం ‘పీఎంజేఏవై’

70 ఏళ్లు దాటిని వారికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): డెబ్బై ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ప్రధానమంత్రి జన్‌ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) పథకం కింద రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎం.టి.కృష్ణబాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వృద్ధుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం రాష్ట్రంలో కూడా అమల్లోకి వచ్చింది. ఇప్పటికే ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్‌ కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ కల్పిస్తోంది. అందులో వయో వృద్ధులు కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ద్వారా వీరికి 3,257 రకాల శస్త్ర చికిత్సలు అందిస్తున్నారు. ఆధార్‌ కార్డుల్లో 70 ఏళ్లు పైబడి ఉన్న వారికి ఈ పథకం కింద ఉచిత వైద్యం అందిస్తారు. వయో వృద్ధులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాల్లో దేన్ని ఉపయోగించుకుంటారో వారే నిర్ణయించుకోవాలి. ఆయుష్మాన్‌ యాప్‌ ద్వారా సినియర్‌ సిటీజన్లు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. అర్హత కలిగిన సీనియర్‌ సిటిజన్లకు జిల్లాల్లో ప్రత్యేక కార్డులు అందిస్తారు. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో దీనిపై చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..

Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..

Updated Date - Apr 03 , 2025 | 05:34 AM