ఒడియా మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:59 PM
ఒడియా మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మంగళవారం రాత్రి ఇచ్ఛాపురంలోని బాపూజీ ఒడియా పాఠాఘర్ అధ్యక్షుడు రఘునాధ్ గౌడో అధ్యక్షతన 90వ ఉత్కళ్ దివస్ వేడుకలు నిర్వహించారు.

ఇచ్ఛాపురం, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ఒడియా మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే బెందాళం అశోక్ తెలిపారు. మంగళవారం రాత్రి ఇచ్ఛాపురంలోని బాపూజీ ఒడియా పాఠాఘర్ అధ్యక్షుడు రఘునాధ్ గౌడో అధ్యక్షతన 90వ ఉత్కళ్ దివస్ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో రెండు సార్లు ఒడియా మైనార్టీల సమస్యలపైప్రశ్నించినట్లు తెలిపారు. కార్య క్రమంలో ఒడియా డీఐదుర్గాప్రసాద్, ఉత్కళాంధ్ర జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సత్యనారాయణపాడి, ఏపీ ఒడియా టీచర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బృందావన్ దొళై, శివప్రసాద్, ఎంఈవో-1, 2 అప్పారావు, విశ్వనాధం, పరపటి మంజులత, నందికి జాని, కాళ్ల దిలీప్ పాల్గొన్నారు.
మహామంత్ర యజ్ఞం విజయవంతం చేయాలి
బెల్లుపడలో ఈనెల 19 నుంచి ఐదురోజులపాటు నిర్వహించనున్న శ్రీరామతారకమహామంత్ర సహిత పంచకుండా త్మక యజ్ఞం విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ కోరారు. మంగళవారం మహామంత్ర సహిత పంచకుండాత్మక యజ్ఞానికి శుభరాట వేశారు. ఈ సందర్భంగా అశోక్ అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఐదురోజులు పాటు జరగనున్న యజ్ఞం విజయవంతంగా జరిగేందుకు అధికారులు సహకరించాలని తెలిపారు. యజ్ఞంలో పాల్గొవడానికి వేలాది భక్తులు రానుండడంతో వాహనాలు హైవే గుండా సుమాడిమీదుగా మళ్లించాలని పోలీసులకు సూచించారు. అనంతరం యజ్ఞం పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ పిలక రాజలక్ష్మి, మునిసిపల్ కమీషనర్ రమేష్,విద్యుత్ శాఖ ఏఈ గోవిందరావు, గ్రామ పెద్దలు ఆశి జీవులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.