Fire accident రిమ్స్ డిజిటల్ లైబ్రరీలో అగ్నిప్రమాదం
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:57 PM
Fire accident శ్రీకాకుళంలోని రిమ్స్ డిజిటల్ లైబ్రరీలో మంగళవారం ఓ ఏసీ మెషిన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. లంచ్ సమయం కావడంతో లైబ్రరీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఏసీలో షార్ట్ సర్క్యూట్ కారణం
అరవసల్లి, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని రిమ్స్ డిజిటల్ లైబ్రరీలో మంగళవారం ఓ ఏసీ మెషిన్‌లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. లంచ్ సమయం కావడంతో లైబ్రరీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రిమ్స్ వర్గాల కథనం మేరకు.. లంచ్ సమయం కావడంతో విద్యార్థులంతా భోజనాల కోసం మెస్‌కు వెళ్లా రు. లైబ్రేరియన్ దేవానంద్ తన సీటులో కూర్చొని విధులు నిర్వర్తిస్తున్నాడు. అంతలో పక్కనే ఉన్న డిజిటల్ లైబ్రరీ నుంచి వాసన రావడం గమనించి అసిస్టెంట్‌ను అప్రమత్తం చేశాడు. డిజిటల్ లైబ్రరీ లోపల నుంచి దట్టమైన పొగలు రావడం గమనించి, వెంటనే లైబ్రరీకి వెళ్లాడు. లైబ్రరీ లోపల నుంచి పొగతో పాటు ఏసీ పరికరం నుంచి చిన్న మంటలు రావడం గమనించి ఎలక్ట్రీషియన్‌కు ఫోన్ చేసి, మొత్తం భవనానికే విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. ప్రిన్సిపాల్‌కు విషయం తెలియజేయడంతో ఆయన వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. అనంతరం ఎలక్ట్రీషియన్ సహాయంతో విద్యుత్ సరఫరాను జిల్లా అగ్నిమాపక అధికారి జె.మోహనరావు సమక్షంలో పునరుద్ధరించారు. లైబ్రరీలోని ఓ ఏసీ మెషిన్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడం తో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు జె.మోహనరావు తెలిపారు. ఎటు వంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని చెప్పారు. ప్రమాదం జరిగిన సమ యంలో విద్యార్థులు డిజిటల్ లైబ్రరీలో లేకపోవడంతో ఎటువంటి ఇబ్బంది కలుగలేదని దేవానంద్ చెప్పారు.