Share News

Natural products ప్రకృతి ఉత్పత్తులకు అధిక ధరలు పొందాలి

ABN , Publish Date - Mar 24 , 2025 | 11:48 PM

Natural products ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన ఉత్పత్తులకు అధిక ధరలు పొందేలా ప్రణాళికలు రూపొందించా లని నాబార్డ్‌ డీజీఎం దేవప్రత త్రిపాఠి అన్నారు.

Natural products  ప్రకృతి ఉత్పత్తులకు అధిక ధరలు పొందాలి
ప్రకృతి సాగు ఉత్పత్తులను పరిశీలిస్తున్న నాబార్డ్‌ డీజీఎం దేవప్రత త్రిపాఠి

పాతపట్నం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన ఉత్పత్తులకు అధిక ధరలు పొందేలా ప్రణాళికలు రూపొందించా లని నాబార్డ్‌ డీజీఎం దేవప్రత త్రిపాఠి అన్నారు. బ్రెడ్స్‌ ఆధ్వర్యంలో నాబార్డ్‌ జీవప్రాజెక్ట్‌ ఏరియాలో నిర్వహిస్తున్న ప్రకృతి వ్యవ సాయ పద్ధతులను, సీడ్‌ బ్యాంకును సోమవారం సందర్శించారు. సారవకోట మండల పరిధిలోని రైవాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి ఉత్పత్తులకు మంచిధరను పొందితే సుస్థిరత సాధించవచన్నారు. అనం తరం స్థానిక బ్రెడ్స్‌ కార్యాలయంలో గ్రీన్‌బాండ్‌ ఎఫ్‌పీవోలు, బీబీవోలు, రైవాడ, రంకిణి, ఇల్లయ్యపురం, కొత్తపేట గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నాబార్డ్‌ జిల్లా డీడీఎం రమేష్‌ కృష్ణ, బ్రెడ్స్‌ సీఈవో రామకృష్ణరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2025 | 11:48 PM