Performance పనితీరు మెరుగుపరచుకోవాలి: ఎమ్మెల్యే ఎంజీఆర్
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:58 PM
Performance ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది పనితీరు మార్చు కుని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.

కొత్తూరు, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రిలోని వైద్యులు, సిబ్బంది పనితీరు మార్చు కుని రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శుక్రవారం కొత్తూరు సామాజిక ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి అంతా కలియ తిరిగి సమస్యలను అడిగితెలుసుకున్నారు. ఇక్కడి వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేస్తే చర్యలు తప్పవన్నారు. కొత్తభవనం పనులు పూర్తయితే రోగులకు వసతి సమస్య తీరనుం దని ఆసుపత్రి సూపరింటెండెంట్ డి.కిశోర్ ఎమ్మెల్యేకు వివరించారు. సంబంధిత అధికారు లతో మాట్లాడి భవన నిర్మాణ పనులు పూర్త య్యేలా చూస్తానని ఎమ్మెల్యే తెలిపారు.
పేదరికాన్ని అధిగమించడమే లక్ష్యం
పాతపట్నం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): పేద రికాన్ని అధిగమించడమే పీ-4లక్ష్యమని ఎమ్మె ల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఐదు మండలాల ఎంపీడీవోలు, ఇతర అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న 10 మంది పేదరికంలో అట్ట డుగు స్థాయిలో ఉన్న 20 మందికి చేయూతని స్తూ అభివృద్ధి చేయడం ఒక మార్గమన్నారు. పేదరిక నిర్మూలనకు ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించాలన్నారు.
తాగునీటి సమస్య పరిష్కారం
హిరమండలం,మార్చి28(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. హిర మండలంలో రక్షిత నీటి పథకం నుంచి తాగు నీరు సక్రమంగా అందక పోవడంతో మహి ళలు పలుమార్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. దీనికి స్పందించిన ఆయన ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. శుక్రవారం గాంధీ నగర్‌లో కొత్త పైప్‌లైన్ల ద్వారా నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, ఆర్ డబ్ల్యూఎస్ డీఈ వెంకట అప్పల నాయుడు, ఎంపీడీవో కాళీప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.