Share News

quality of food ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:59 PM

quality of food విద్యార్థినులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి హెచ్చరించారు.

quality of food  ఆహారంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవు
కేజీబీవీలో ఆహార పదార్థాలను పరిశీలిస్తున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ మహేశ్వరరెడ్డి

హరిపురం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థినులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ కేవీ మహేశ్వరెడ్డి హెచ్చరించారు. మందస మండలం వీజీపురంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. గురువారం పాఠశాలలో విషాహారం తిని 22 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసు కున్న ఆయన పాఠశాలను సందర్శించి అనారో గ్యానికి గురైన విద్యార్థినులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం ఆహార పదా ర్థాలను పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేయాలని, వేసవి దృష్ట్యా తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. మరమ్మతుకు గురైన తాగునీటి ప్యూరిఫైర్‌ను బాగు చేయించాలన్నారు. విద్యార్థినులతో మాట్లాడి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులున్నా నిర్భయంగా తెలియజేయాలని సూచిం చారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కార్యక్ర మంలో ఎంఈవో ఎం.లక్ష్మణరావు, సీఐ తిరుపతిరావు, చిన్నంనాయుడు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌, కేజీబీవీ ప్రత్యేకాధికారి వాసంతి తదితరులు పాల్గొన్నారు.

నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు

పలాస, మార్చి 28(ఆంధ్రజ్యోతి):కాశీబుగ్గ సబ్‌ డివిజన్‌ పరిధిలో నేరాల కట్టడి, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులకు ఆదేశించారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్ర వారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి వివిధ అంశాలపై చర్చించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, మహిళా సమస్యల పరిష్కారం, అట్రాసిటీ, ప్రాపర్టీ, మహిళ సంబంధిత కేసుల దర్యాప్తును 60 రోజుల్లో పూర్తి చేసి చార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలుచేయాలన్నారు. ఆయన వెంట డీఎస్పీ వి.వెంకట అప్పారావు, సీఐ, ఎస్‌ఐలు ఉన్నారు. అంత కుముందు కాశీబుగ్గ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో ప్రజాసమస్యల పరిష్కారవేదికను ఎస్పీ మహేశ్వరరెడ్డి నిర్వహిం చారు. ప్రజల వినతులు స్వీకరించి వారితో ప్రత్యేకంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:59 PM