Share News

ఒకేసారి నాలుగు కొలువులు

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:17 AM

పురపాలక సంఘ పరిధిలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు నగర్‌ (బీఆర్‌ నగర్‌)లో నివాసం ఉంటున్న జ్యోత్స్నకు రెండు రోజుల కిందట విడుదలైన ఫలితాల్లో ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు, ఎల్‌ అండ్‌టీలో ఎలక్ర్టికల్‌ ఇంజ నీర్‌గా ఎంపికైంది.

ఒకేసారి నాలుగు కొలువులు
కుటుంబ సభ్యులతో నక్క జ్యోత్స్న

ఆమదాలవలస, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘ పరిధిలోని బొడ్డేపల్లి రాజగోపాలరావు నగర్‌ (బీఆర్‌ నగర్‌)లో నివాసం ఉంటున్న జ్యోత్స్నకు రెండు రోజుల కిందట విడుదలైన ఫలితాల్లో ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలు, ఎల్‌ అండ్‌టీలో ఎలక్ర్టికల్‌ ఇంజ నీర్‌గా ఎంపికైంది. బూర్జ మండలం ఓవీ పేట గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యా యుడు రామ్మూర్తి, కుమారి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉద్యో గరీత్యా వీరి కుటుంబం బీఆర్‌ నగర్‌లో ఉంటున్నారు. విజయనగరం జేఎన్‌టీయూలో ఇంజనీర్‌గా ఈఈఈ పూర్తిచేసిన జ్యోత్స్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ పీవోగా ఎంపికై కొలువుదీరారు. ప్రస్తుతం బ్యాంక్‌ ఆఫ్‌ మహా రాష్ట్ర పీవోగా, తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో వర్క్‌ పోస్టులకు, ఎలక్ర్టికల్‌ ఇంజనీర్‌ పోస్టులకు ఎంపికైంది. రామ్మూర్తి కుమారుడు తరుణ్‌ కూడా తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌, ఏపీలో కెనరా బ్యాంక్‌కు ఎంపికయ్యాడు.

Updated Date - Apr 03 , 2025 | 12:17 AM