Share News

Veera Gunnamma ‘గున్నమ్మ’ ఆశయ సాధనకు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:55 PM

Veera Gunnamma సాయుధ రైతాంగ పోరాటంలో పేద ప్రజల తరఫున పోరాటం చేసిన వీరనారి శాను మాను గున్నమ్మ అని, ఆమె ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. మోహనరావు అన్నారు.

Veera Gunnamma ‘గున్నమ్మ’ ఆశయ సాధనకు కృషి చేయాలి
వీరనారి సాసుమాను గున్నమ్మ స్మారక స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న నేతలు

హరిపురం, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): సాయుధ రైతాంగ పోరాటంలో పేద ప్రజల తరఫున పోరాటం చేసిన వీరనారి శాను మాను గున్నమ్మ అని, ఆమె ఆశయ సాధన కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్ర ప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. మోహనరావు అన్నారు. వీజీపురంలోని సాసు మాను గున్నమ్మ స్మారక స్థూపం వద్ద పూల మాలలు వేసి నివాళి అర్పించారు. అనం తరం మందసలో కొర్ల హేమారావు చౌదరి అధ్యక్షతన అమరవీరుల స్మారక సభ, సాసు మాను గున్నమ్మ 85వ వర్ధంతి ని నిర్వహిం చారు. నాటి పోరాటాల ఫలితం గానే మం దస ప్రాంతంలో రిజర్వాయర్లు, ఆన కట్టలు వెలిశాయన్నారు. వీజీపురం సర్పంచ్‌ కర్రి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వీరనారి గున్న మ్మ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించారు. ఎం.రామకృష్ణ, ఎంపీపీ దానయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:55 PM