Share News

YSRCP: వామ్మో.. ఇన్ని అరాచకాలకు పాల్పడ్డారా..

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:16 AM

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు ఐదో తేదీ నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో వైసీపీ నేతల భూకబ్జాలపై ఏకంగా 2 లక్షల ఫిర్యాదులు అందాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బ్రహ్మం మాట్లాడారు.

YSRCP: వామ్మో.. ఇన్ని అరాచకాలకు పాల్పడ్డారా..
YSRCP

అమరావతి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం డిసెంబరు ఐదో తేదీ నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో వైసీపీ నేతల భూకబ్జాలపై ఏకంగా 2 లక్షల ఫిర్యాదులు అందాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బ్రహ్మం మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో పేదలకు చెందిన భూములతోపాటు ప్రభుత్వ, దేవదాయ భూములను కూడా ఆ పార్టీ నేతలు కబ్జా చేశారు. ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల కుటుంబం కడప నగర శివార్లలో 52 ఎకరాల అటవీ భూమిని కొట్టేసింది.

మరికొందరు నాయకులు జిల్లాల్లో చెలరేగిపోయారు. తప్పుల తడకగా ‘రీ సర్వే’ చేయించి రైతులను నానా క్షోభ పెట్టారు. లాండ్‌ టైటిలింగ్‌ చట్టం తెచ్చి రైతుల భూములు కొట్టేయాలని చూశారు. అందుకే టీడీపీ ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ‘22ఏ’ నిషేధ జాబితా నుంచి రైతుల వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు తొలగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులు అభినందిస్తున్నారు’’ అని అన్నారు.

Updated Date - Jan 05 , 2025 | 11:16 AM