Kolikapudi Srinivas Rao: పదే పదే ఏమిటిది?
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:41 AM
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వరుస వివాదాలతో పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. తాజాగా, స్థానిక నేతపై చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని హెచ్చరించడంతో పార్టీ నాయకత్వం కఠినంగా స్పందిస్తోంది.

ఎమ్మెల్యే కొలికపూడిపై మళ్లీ టీడీపీ అధిష్ఠానం సీరియస్
రఘురాం, ఎంపీ కేశినేని, సత్యనారాయణరాజుతో కమిటీ
10 నెలల ఘటనలపై నివేదిక సమర్పణ
తుది నిర్ణయం చంద్రబాబుదే
అమరావతి, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పదే పదే పార్టీకి తలనొప్పులు తీసుకొస్తున్న వైనం అధిష్ఠానాన్ని ఆగ్రహానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టిస్తున్నారని.. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని గుర్రుగా ఉంది. తాజాగా స్థానిక టీడీపీ నేత రమేశ్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏకంగా అధిష్ఠానానికే అల్టిమేటం జారీ చేయడం.. 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని బెదిరించడాన్ని పార్టీ సీరియ్‌సగా పరిగణిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త సత్యనారాయణరాజుతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నియోజకవర్గంలో గత 10 నెలలుగా చోటుచేసుకున్న సంఘటనలపై సమగ్ర నివేదిక తెప్పించుకున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు.. దానిని పార్టీ అధినేత చంద్రబాబుకు సమర్పించారు. కొలికిపూడిపై ఎలాంటి చర్య తీసుకోవాలో చంద్రబాబుదే తుది నిర్ణయమని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..