TDP: ఆ ‘రెండూ’ కూటమి కైవసం!
ABN , Publish Date - Feb 05 , 2025 | 05:50 AM
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక అనివార్య కారణాల వల్ల వాయిదా పడడంతో మంగళవారం నందిగామలోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించారు.

నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుపతి డిప్యూటీ మేయర్ పీఠాలు సొంతం
నందిగామలో వైసీపీ అభ్యర్థికి మూడు ఓట్లు
నందిగామ/తిరుపతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోమవారం వాయిదా పడిన రెండు స్థానాలూ కూటమికే దక్కాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్ పర్సన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పీఠాలను టీడీపీ కైవసం చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మునిసిపల్ చైర్‌పర్సన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. సోమవారం జరగాల్సిన ఎన్నిక అనివార్య కారణాల వల్ల వాయిదా పడడంతో మంగళవారం నందిగామలోని జగ్జీవన్‌రామ్ భవన్‌లో చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించారు. దీనికి 18 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యురాలి హోదాలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య హాజరయ్యారు. ఎన్నికల అధికారి, ఆర్డీవో కె. బాలకృష్ణ ఎన్నిక నిర్వహించారు. కూటమి అభ్యర్థిగా పదో వార్డుకు చెందిన మండవ కృష్ణకుమారి పేరును సౌమ్య ప్రతిపాదించారు. ఆమెకు మద్దతుగా 14 మంది కౌన్సిలర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యురాలు ఓటు వేశారు. ఆమెకు మొత్తం 15 ఓట్లు వచ్చాయి. వైసీపీ తరఫున చైర్‌పర్సన్ బరిలో నిలిచిన ఓర్సు లక్ష్మికి మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి. లక్ష్మి తన ఓటు తాను వేసుకోకుండా తటస్థంగా ఉండి పోయారు. మెజారిటీ సభ్యుల బలం ఉన్న మండవ కృష్ణకుమారి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనట్టు ఆర్డీవో ప్రకటించారు. ఆమెకు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
తిరుపతిలో..
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. నాటకీయ పరిణామాలు, ఉద్రిక్తతల మధ్య డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్లో జరిగిన ఎన్నికలో టీడీపీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో 47 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎక్స్‌అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 48 మంది ఎన్నికకు హాజరుకాగా ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, ఒక మహిళా కార్పొరేటర్ గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 26 మంది టీడీపీ అభ్యర్థికి, 21 మంది వైసీపీ అభ్యర్థికి మద్దతు పలకగా ఒకరు తటస్థంగా ఉండిపోయారు.
మరిన్ని వార్తల కోసం..
PM Modi: ఎవర్నీ వదిలిపెట్టలేదు.. ఆటాడుకున్న పీఎం
Maha Kumbh Mela 2025: కుంభమేళాకు ప్రధాని మోదీ.. పవిత్ర స్నానంతోపాటు ప్రత్యేక పూజలు
Delhi Elections: ఎన్నికలకు సిద్ధం.. 35,000 మంది పోలీసులు, సీసీ టీవీ నిఘా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి