పాస్టర్ ప్రవీణ్ కేసులో నిజాలు చెప్పండి
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:53 AM
పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ నిజానిజాలు వెల్లడించాలని పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మత పెద్దలు డిమాండ్ చే శారు.

లబ్బీపేట, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానస్పద మృతిపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ నిజానిజాలు వెల్లడించాలని పలు క్రైస్తవ సంఘాలకు చెందిన మత పెద్దలు డిమాండ్ చే శారు. ఆలిండియా దళిత క్రిస్టియన్ పీస్ ఫోరం ఆధ్వర్యంలో బందర్ రో డ్డులోని ఒక హోటల్‌లో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు క్రైస్తవ సంఘా ల మత పెద్దలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రవీణ్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని, అవసరమైతే న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అయన మృతిపై భిన్నాభిప్రాయాలు, అనుమానాలున్నాయని, యాక్సిడెంట్ అని కొందరు, హత్య అని ఎక్కువమంది భావిస్తున్నారన్నారు. పోలీసులు చెప్పిన చిత్రాలలో ముఖం సరిగా కనిపించడం లేదని, ప్రవీణ్ మృతి అనుమానస్పదమేనన్నారు. ఈ మృతి కేసును ఛేదించాల్సిన భాద్యత పోలీసు అధికారులది, ప్రభుత్వానిదేనని, రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులపై ఎవరైనా దాడి చేస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. ఆలిండియా దళిత క్రిస్టియన్ ఫోరం అధ్యక్షుడు లంకా కరుణాకర్, మన్న మినిస్ర్టిస్ అధినేత బిషప్ పి.స్పర్జన్ రాజు, పాస్టర్ జాన్ భాస్కరరావు, ఏఆర్ స్టీఫెన్ సన్, పాస్టర్ చాట్ల లూధర్ ప్రశాంత్ పాల్గొన్నారు.