తొలి రోజు 95.18 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:24 AM
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన మంగళవారం 95.18 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,654 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 70 లక్షల 73 వేల 500 విడుదల కాగా, తొలి రోజు మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 1,16,748 మందికి రూ.49 కోట్ల 9 లక్షల 21 వేలు పెన్షన్ల సొమ్మును అందించగా, ఇంకా 5,906 మందికి అందించాల్సి ఉంది.

- జిల్లాలో మొత్తం 1,22,654 మందికి గానూ 1,16,748 మందికి అందజేత
పాడేరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలి రోజైన మంగళవారం 95.18 శాతం మంది లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందించారు. జిల్లాలోని 22 మండలాల పరిధిలో మొత్తం 1,22,654 మంది పింఛన్ లబ్ధిదారులకు రూ.51 కోట్ల 70 లక్షల 73 వేల 500 విడుదల కాగా, తొలి రోజు మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 1,16,748 మందికి రూ.49 కోట్ల 9 లక్షల 21 వేలు పెన్షన్ల సొమ్మును అందించగా, ఇంకా 5,906 మందికి అందించాల్సి ఉంది. దీంతో జిల్లాలో తొలి రోజు పెన్షన్ల పంపిణీ 95.18 శాతంగా నమోదైంది. తొలి రోజు పెన్షన్ పొందని లబ్ధిదారులకు బుధవారం అందజేస్తామని అధికారులు తెలిపారు. కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ కుమ్మరిపుట్టు గ్రామంలో పలువురు లబ్ధిదారులకు పెన్షన్ సొమ్మును అందించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీఆర్‌డీఏ పీడీ వి.మురళి కాల్ సెంటర్ ద్వారా జిల్లాలో పెన్షన్ల పంపిణీ పర్యవేక్షించి, కార్యక్రమం విజయవంతంగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, ఎంపీడీవో తేజరతన్, వెలుగు ఏపీఎం జె.చిన్నారావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, చింతలవీధి సర్పంచ్ సీతమ్మ, లగిశపల్లి సర్పంచ్ పార్వతమ్మ, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు డప్పోడి వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.