Share News

‘ది డెక్‌’లో టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:36 AM

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఉద్దేశించిన ‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌’ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయనుంది. సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం...‘ది డెక్‌’లో ఇందుకోసం 50 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు నుంచి మూడు అంతస్థులు కేటాయించనున్నారు.

‘ది డెక్‌’లో టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌
సిరిపురంలో వీఎంఆర్‌డీఏ నిర్మించిన భవనం

50 వేల చ.అ. విస్తీర్ణంలో ఏర్పాటు

నెల రోజుల్లో ప్రారంభం

కలెక్టర్ల సమావేశంలోముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడి

విశాఖపట్నం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి, స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందించడానికి ఉద్దేశించిన ‘రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ సెంటర్‌’ కేంద్రాన్ని విశాఖపట్నంలో ఏర్పాటుచేయనుంది. సిరిపురం జంక్షన్‌లో వీఎంఆర్‌డీఏ నిర్మించిన మల్టీ లెవెల్‌ కారు పార్కింగ్‌ భవనం...‘ది డెక్‌’లో ఇందుకోసం 50 వేల చ.అ. విస్తీర్ణంలో రెండు నుంచి మూడు అంతస్థులు కేటాయించనున్నారు. అమరావతిలో కలెక్టర్లతో సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నిర్వహించిన సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. భవనం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ వెల్లడించడంతో నెల రోజుల్లోనే దానిని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. రెండు రోజుల క్రితమే స్టార్టప్‌ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ ప్రధాన కేంద్రం విజయవాడలో ఉంటుందని, దానికి అనుబంధంగా విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, అనంతపురంలలో స్పోక్‌ సెంటర్లు ఏర్పాటుచేస్తామని వెల్లడించింది. ఆ మేరకు విశాఖలో సబ్‌ సెంటర్‌ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

Updated Date - Mar 27 , 2025 | 01:36 AM