Share News

పత్రికా పఠనంతో ప్రపంచ జ్ఞానం

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:36 AM

పత్రికా పఠనంతో ప్రపంచ జ్ఞానం లభిస్తుందని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు.

పత్రికా పఠనంతో ప్రపంచ జ్ఞానం

  • నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ

  • ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పేపర్‌ చదవాలని సూచన

  • వినూత్న ఒరవడితో ముందుకు సాగుతున్న ‘ఆంధ్రజ్యోతి

  • ‘సీఎంఆర్‌’ గ్రూపు అధినేత మావూరి వెంకటరమణ

  • పాఠకులను ప్రోత్సాహకాలు అందజేయడం గొప్ప విషయం

  • ‘ఐకానిక’ ప్రాజెక్టు మార్కెటింగ్‌ హెడ్‌ అవినాష్‌వర్మ

  • ఆంధ్రజ్యోతి కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌ లక్కీ డ్రా విజేతల ఎంపిక

  • లక్కీ డ్రా ద్వారా ‘ఆంధ్రజ్యోతి’ ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ విజేతల ఎంపిక

విశాఖపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి):

పత్రికా పఠనంతో ప్రపంచ జ్ఞానం లభిస్తుందని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ర్టాల్లోని పాఠకులకు కోటి రూపాయల విలువైన బహుమతులను అందించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘కార్‌ అండ్‌ బైక్‌ రేస్‌’ యూనిట్‌ స్థాయి లక్కీ డ్రా కార్యక్రమం శనివారం సాయంత్రం అక్కయ్యపాలెంలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్‌ కమిషనర్‌ లక్కీ డ్రా ద్వారా ప్రథమ బహుమతి విజేతను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ పేపర్‌ చదవడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని, చుట్టుపక్కల జరిగే విషయాలు కూడా తెలుస్తాయన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు పేపర్‌ పఠనం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో పేపర్‌ చదవాలని సూచించారు. పేపర్‌ చేతితో పట్టుకుని చదివితేనే ఆ అనుభూతి వేరన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ మంచి పేపర్‌ ప్రశంసించారు. మరో అతిథి సీఎంఆర్‌ అధినేత మావూరి వెంకటరమణ డ్రా ద్వారా ద్వితీయ బహుమతి విజేతను ఎంపిక చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అక్షరమే ఆయుధమంటూ వినూత్నమైన ఒరవడితో ‘ఆంధ్రజ్యోతి’ ముందుకు సాగుతోందన్నారు. సంక్రాంతి సమయంలో ముగ్గులు పోటీలు కూడా నిర్వహిస్తోందని, ఈ విధంగా పాఠకులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. లక్కీ డ్రాలో మూడో విజేతను ఎంపిక చేసిన ఐకానిక్‌ ప్రాజెక్ట్స్‌ మార్కెటింగ్‌ హెడ్‌ అవినాష్‌వర్మ మాట్లాడుతూ ప్రింట్‌ మీడియాలో ప్రముఖ సంస్థగా కొనసాగుతోన్న ‘ఆంధ్రజ్యోతి’ పాఠకులకు ప్రోత్సాహకాలను అందించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సర్క్యులేషన్‌ డైరెక్టర్‌ టి.రామకృష్ణారావు, బ్రాంచ్‌ మేనేజర్‌ కె.రామకృష్ణారావు, సిస్టమ్స్‌ మేనేజర్‌ ఎం.కిశోర్‌బాబు, ఎడిషన్‌ ఇన్‌చార్జి ఎల్‌.వి.రామాంజనేయులు, బ్యూరో ఇన్‌చార్జి యర్రా శ్రీనివాసరావు, సర్క్యులేషన్‌ ఇన్‌చార్జి బీఏవీ సత్యనారాయణ, అడ్వర్‌టైజ్‌మెంట్‌ ఇన్‌చార్జి శ్రీనివాసచక్రవర్తి, ప్రొడక్షన్‌ ఇన్‌చార్జి కుమార్‌, సీనియర్‌ స్టాఫ్‌ రిపోర్టర్లు నాళ్ల ఆదినారాయణ, రెడ్డి వెంకటరావు, పలు విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 01:37 AM