Share News

Visakha-Charlapalli: జనంతో కిక్కిరిసిన రైళ్లు.. ఖాళీగా విశాఖ-చర్లపల్లి రైలు.. ప్రయాణికుల ఆగ్రహం

ABN , Publish Date - Jan 17 , 2025 | 12:20 PM

Visakha-Charlapalli trian: ఓవైపు రైళ్లో సీటు దొరక్క, కిందా మీద పడి మరీ ప్రయాణికులు హైదరాబాద్‌కు వస్తుంటే.. ఓ రైలు మాత్రం ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగి వచ్చేసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాము ఇలా సీట్లు దొరక్క అల్లాడిపోతుంటే ఓ రైలు ఖాళీగా రావడం పట్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Visakha-Charlapalli: జనంతో కిక్కిరిసిన రైళ్లు.. ఖాళీగా విశాఖ-చర్లపల్లి రైలు.. ప్రయాణికుల ఆగ్రహం
Visakha- charlapally train

విశాఖపట్నం, జనవరి 17: సంక్రాంతి పండుగను తమ సొంతూళ్లలో ఎంతో ఆనందంగా జరుపుకున్న ప్రజలు తిరిగి తమ రొటీన్ లైఫ్‌లోకి అడుగుపెట్టేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. సంక్రాంతి సంద్భంగా స్కూళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు వచ్చేయడంతో ఈనెల 11 నుంచే హైదరాబాదీలు సొంతూళ్లకు బయలుదేరి వెళ్లిపోయారు. నాలుగు రోజుల పాటు సంక్రాంతిని తమ వారి మధ్య ఎంతో ఉత్సహంగా జరుపుకుని సెలవులు అయిపోవడంతో హైదరాబాద్‌కు పయనమయ్యారు. దీంతో బస్సులు, రైల్వే స్టేషన్‌లు తిరుగు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులు, రైళ్లు ఎక్కడ చూసిన ప్రయాణికులు నిండిపోయారు.


ఓవైపు రైళ్లో సీటు దొరక్క, కిందా మీద పడి మరీ ప్రయాణికులు హైదరాబాద్‌కు వస్తుంటే.. ఓ రైలు మాత్రం ప్రయాణికులు లేకుండానే ఖాళీగా తిరిగి వచ్చేసింది. రైల్వే అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాము ఇలా సీట్లు దొరక్క అల్లాడిపోతుంటే ఓ రైలు ఖాళీగా రావడం పట్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడి నుంచి రైలు ఖాళీగా వచ్చింది.. రైల్వే అధికారులు చేసిన తప్పిదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. సర్వదర్శనానికి డేట్ ఫిక్స్


ఇటీవల రూ.413 కోట్ల వ్యయంతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇకపై సికింద్రాబాద్‌కు బదులుగా చాలా ట్రైన్‌లు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌లో హాల్టింగ్ చేయనున్నాయి. ఇదిలా ఉండగా.. సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి నుంచి చాలా ప్రాంతాలకు.. అలాగే పలు ప్రాంతాల నుంచి చర్లపల్లికి రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే దీనిపై రైల్వే అధికారుల నుంచి ఎలాంటి ప్రచారం లేకపోవడంతో ఆ రైళ్లు కాస్తా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఓవైపు సంక్రాంతి పండుగ నేపథ్యంలో రైళ్లలో సీటు దొరక్క ప్రజలు నానా అవస్థలు పడుతుంటే... రైల్వే అధికారుల నిర్లక్ష్యం కారణంగా విశాఖపట్నం నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ్ రైలు ప్రయాణికులు లేకుండానే ఖాళీగా బయలుదేరింది.

visakha-train.jpg


ఈరోజు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు విశాఖ నుంచి పావుగంట ఆలస్యంగా బయలుదేరింది ఈ రైలు. రిజర్వేషన్‌ అవసరం లేకుండా సామాన్య ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ఈ రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడంతో ఈ రైలు గురించి ప్రజలు తెలుసుకోలేకపోయారు. దీంతో సంక్రాంతి నుంచి తిరుగు ప్రయాణంలో అనేక రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిపోతుంటే ఈ రైలు మాత్రం ప్రయాణికుల లేకుండానే విశాఖ నుంచి చర్లపల్లికి బయలుదేరింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న ప్రయాణికులు మాత్రం రైల్వే అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ నుంచి బయలుదేరిన రైలుపై ముందస్తుగా సమాచారం ఇచ్చుంటే తమకు ఇలాంటి అగచాట్లు తప్పేవి కదా అని మండిపడుతున్నారు. ఏది ఏమైనా రైల్వే అధికారుల నిర్లక్ష్యంగా ప్రయాణికులతో రావాల్సిన విశాఖ- చర్లపల్లి సికింద్రాబాద్ జనసాధరణ్‌ రైలు ఖాళీగా గమ్యస్థానానికి చేరుకుంటోంది.


ఇవి కూడా చదవండి...

స్టాక్ మార్కెట్.. వరుస లాభాలకు బ్రేక్..

మీ కళ్లు ఎంతో షార్ప్ అయితేనే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 17 , 2025 | 01:05 PM