టీడీపీలో250 కుటుంబాల చేరిక
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:06 AM
: మండలంలోని అలజంగి, వెలగవలసలోని వైసీపీకి చెందిన సుమారు 250 కుటుంబాలు బుధవారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో టీడీపీలో చేరాయి.

బొబ్బిలి, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అలజంగి, వెలగవలసలోని వైసీపీకి చెందిన సుమారు 250 కుటుంబాలు బుధవారం బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబీనాయన సమక్షంలో టీడీపీలో చేరాయి. అలజంగి టీడీపీ నేత రెడ్డి ప్రసాద్, వెలగవలస గ్రామపెద్ద వి.శ్రీరాములు ఆధ్వర్యంలో వారంతా పార్టీలు చేరగా, బేబీనాయన పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. నియోజకవర్గంలో బేబీనాయన ఎమ్మెల్యే హోదాలో, వ్యక్తిగతంగా చేస్తున్న అభివృద్ధి, సేవా కార్యక్రమాలను చూసి తామంతా ఆయన నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సత్తరపు సత్యనారాయణ, రేజేటి ఏసు, చిట్టి, మోహన్, యజ్జల అప్పారావు, రేజేటి అప్పారావు, పెంకి వేణుగోపాలనాయుడు తదితర కుటుంబాలు పార్టీలో చేరాయి.