Share News

వావిలపాడులో ఎడ్ల బండ్ల పరుగు పోటీలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:42 PM

మండలంలోని వావిలపాడు, బొద్దాం, సోంపురం, వేపాడ గ్రామాలో నూకాలమ్మ పండగను ఆదివారం ఘనంగా నిర్వ హించుకున్నారు. వావిలపాడులో నూకాలమ్మ అనుపోత్సవం పురస్కరించుకొని సాయంత్రం ఏర్పాటు చేసిన ఎడ్లబండ్ల పురుగు పోటీలు ఆకట్టుకున్నాయి.

వావిలపాడులో ఎడ్ల బండ్ల పరుగు పోటీలు
దౌడు తీస్తున్న ఎడ్ల బండి:

వేపాడ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వావిలపాడు, బొద్దాం, సోంపురం, వేపాడ గ్రామాలో నూకాలమ్మ పండగను ఆదివారం ఘనంగా నిర్వ హించుకున్నారు. వావిలపాడులో నూకాలమ్మ అనుపోత్సవం పురస్కరించుకొని సాయంత్రం ఏర్పాటు చేసిన ఎడ్లబండ్ల పురుగు పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను వావిలపాడులోని గండి వెంకటరావుకు చెందిన మరిడిమాంబ బండి, నెక్కలవానిపాలెంలోని పైడి తల్లమ్మ, దేవరాపల్లిలోని వీరాంజనేయ బండికి బహుమతులు లభించాయి. అనంతరం విజేతలకు నిర్వాహకులు నగదు బహుమతులు అందజేశారు.

Updated Date - Mar 30 , 2025 | 11:42 PM