Share News

పురుగు మందు తాగి వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 03 , 2025 | 12:18 AM

మండలంలోని జన్నివలస గ్రా మానికి చెందిన కొత్తయ్య పురుగుల మందు తాగి మృతి చెందాడు.

పురుగు మందు తాగి వ్యక్తి మృతి

రామభద్రపురం,ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని జన్నివలస గ్రా మానికి చెందిన కొత్తయ్య పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. జొన్నవలసకు చెందిన పతివాడ కొత్తయ్య తండ్రి సత్యం కొన్నాళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కొత్తయ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు సాలూరు సీహెచ్‌సీలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ బుధవారం రాత్రి చికిత్స పొందుతూ కొత్తయ్య మృతి చెందాడని ఎస్‌ఐ వెలమల ప్రసా దరావు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 12:18 AM