Share News

Tribals కదంతొక్కిన గిరిజనులు

ABN , Publish Date - Mar 29 , 2025 | 11:43 PM

Displaced Tribals అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి.. నేరుగా జీసీసీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. శనివారం సీతంపేట ప్రధాన రహదారి నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.

  Tribals కదంతొక్కిన గిరిజనులు
ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న గిరిజనులు

సీతంపేట రూరల్‌,మార్చి 29(ఆంధ్రజ్యోతి): అటవీ ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి.. నేరుగా జీసీసీ కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్‌ చేశారు. శనివారం సీతంపేట ప్రధాన రహదారి నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. ఆదివాసీ గిరిజనుల వేషధారణలతో నిరసన తెలిపారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయం ప్రధాన గేటు ఎదురుగా బైఠాయించి మహా ధర్నా చేశారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాను రూ.16వేలకు కొనుగోలు చేయాలని , సీతంపేట కేంద్రంగా జీడిపిక్కల పరిశ్రమ నెలకొల్పి గిరిజన యువతకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు. వంద పడకల ఏరియా ఆసుపత్రి అదనపు భవనం, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని, చెరువులు, చెక్‌డ్యాంలు నిర్మించి సాగునీరు అందించాలని కోరారు. తమ సమస్యలపై స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఐటీడీఏ ఏపీవో జి.చిన్నబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో గిరిజన సంఘం నాయకులు తిరుపతిరావు, సాంబయ్య, భాస్కరరావు, గంగాధర్‌, సర్పంచ్‌ సుందరమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 11:43 PM