Share News

hurry up త్వరపడండి

ABN , Publish Date - Mar 26 , 2025 | 12:35 AM

hurry up రేషన్‌కార్డు లబ్ధిదారులంతా నెలాఖరులోపు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ సౌరబ్‌ఘౌర్‌ ఆదేశాలు జారీ చేశారు.

hurry up త్వరపడండి

త్వరపడండి

నెలాఖరులోగా ఈకేవైసీ చేయించుకోవాల్సిందే

జిల్లాలో ఇప్పటికి 92 శాతం పూర్తి

గరివిడి, మార్చి 25(ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు లబ్ధిదారులంతా నెలాఖరులోపు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర కమిషనర్‌ సౌరబ్‌ఘౌర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా కుటుంబాలన్నీ ఈకేవైసీ పూర్తి చేయించుకునే పనిలో నిమగ్నమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇంకా 8 శాతం నమోదు కావాల్సి ఉంది. కాగా గ్రామాల్లో రేషన్‌ డిపో డీలర్లు తమ పరిధిలో ఉన్న కార్డుదారుల్లో ఇంకా ఎవరెవరికి ఈకేవైసీ లేదో గుర్తించి వారిళ్లకు వెళ్లి ఈకేవైసీ నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాల మొబైల్‌ యాప్‌ ద్వారా గాని, రేషన్‌ షాపులో ఉన్న ఈ-పాస్‌ పరికరాల ద్వారా కాని ఈకేవైసీ అప్‌డేట్‌ చేస్తున్నారు. ఐదు సంవత్సరాలలోపు వారు మినహా మిగతా కార్డు సభ్యులంతా ఈకేవైసీ నమోదు చేసుకోవాలి. దీనిపై రెవెన్యూ అధికారులు ఇప్పటికే పలుమార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో 1244 రేషన్‌ డిపోలు ఉండగా వీటి పరిధిలో 5 లక్షల 71 వేల, 240 రేషన్‌కార్డులు (తెలుపు, అంత్యోదయ కలిపి)ఉన్నాయి. ఇకపై ప్రభుత్వ పథకాలు అందాలన్నా ఈకేవైసీ నమోదు తప్పనిసరని చెప్పడంతో అందరూ పరుగులు తీస్తున్నారు.

- ఈకేవైసీ నమోదు అంశాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖాధికారి మధుసూదనరావు వద్ద సంప్రదించగా జిల్లాలో ఈకేవైసీ వేగవంతంగా సాగుతోందన్నారు. రెవెన్యూ సిబ్బంది, డీలర్లు అదే పనిలో ఉన్నారని, నెలాఖరుకు శతశాతం పూర్తిచేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Updated Date - Mar 26 , 2025 | 12:35 AM