సారాపై ప్రత్యేక నిఘా
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:11 AM
ఉమ్మడి విజయనగరం జిల్లాలో సారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నియం త్రించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ అధికారులను ఆదేశించారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ
విజయనగరం క్రైం, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లాలో సారా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నియం త్రించాలని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రొహిబిషన్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఎక్సైజ్‌శాఖ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారా ముద్దాయిలు, అనుమానితులపై బైండోవర్ కేసులు నమోదు చేయాలన్నారు. గ్రామస్థాయి, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రతి గ్రామాన్ని సారా లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. ఒడిశా అధికారులతో సంప్రదింపులు జరిపి సంయుక్తంగా దాడులు నిర్వహించాలన్నారు.పార్వతీపురం, పాలకొండ, కురుపాం స్టేషన్‌లు నాటుసారాపై ప్రత్యేక దృష్టి సారించి నిర్మూలించాలన్నారు. సమావేశంలో ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనాఽథుడు, ఏఈఎస్‌లు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.