Delhi High Court: హోటల్ ఫుడ్ బిల్లులో సర్వీసు ఛార్జీ వసూలు తగదు
ABN , Publish Date - Mar 29 , 2025 | 06:07 AM
హోటళ్లలో వినియోగదారులు ఆహారానికి చెల్లించే బిల్లులో సర్వీసు ఛార్జీని తప్పనిసరిగా కలపడం నిబంధనలకు విరుద్ధమని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2022లో సీసీపీఏ జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనని కోర్టు స్పష్టం చేసింది.

ఢిల్లీ హైకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ, మార్చి 28: హోటల్‌లో వినియోగదారులు కొనుగోలు చేసే ఆహార పదార్థాలకు ఇచ్చే బిల్లులో ‘సర్వీసు ఛార్జీ’ని కూడా కలపడం నిబంధనలకు విరుద్ధమని శుక్రవారం ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఫుడ్ బిల్లులో ఆటోమేటిక్ రీతిలో సర్వీసు ఛార్జీని కలపడం నిషేధం అంటూ కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) జారీ చేసిన మార్గదర్శకాలు సరైనవేనంటూ తీర్పు ఇచ్చింది. వివిధ పేర్లతో తప్పనిసరిగా చెల్లించాలన్న రీతిలో సర్వీసు ఛార్జీని విధించడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనేని తెలిపింది. ఇది ‘అనుచిత వ్యాపార విధానం’ కిందకే వస్తుందని స్పష్టం చేసింది. అనుచిత వ్యాపార విధానాలు, వినియోగదారుల హక్కుల ఉల్లంఘనలను నిరోధిస్తూ 2022 జులైలో సీసీపీఏ మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని సవాలు చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్ ఆసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించాయి.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..