Share News

Rajyasabha: బీఏసీ సమావేశం నుంచి ధన్‌ఖడ్‌ వాకౌట్‌

ABN , Publish Date - Mar 29 , 2025 | 06:06 AM

బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నుంచి రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ వాకౌట్‌ చేశారు. ఈ సమావేశంలో ‘సముచిత గౌరవం’ లోపించడమే కారణమని రాజ్యసభ వర్గాలు తెలిపాయి.

Rajyasabha: బీఏసీ సమావేశం నుంచి ధన్‌ఖడ్‌ వాకౌట్‌

న్యూఢిల్లీ, మార్చి 28: బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నుంచి రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ వాకౌట్‌ చేశారు. ఈ సమావేశంలో ‘సముచిత గౌరవం’ లోపించడమే కారణమని రాజ్యసభ వర్గాలు తెలిపాయి. అయితే వివిధ అంశాలపై ఎన్డీయే ఎంపీలకు, తమకు తీవ్ర విభేదాలు రావడంతో ఆయన మధ్యలో వెళ్లిపోయారని విపక్ష సభ్యులు చెబుతున్నారు. వచ్చే వారం రాజ్యసభ కార్యకలాపాలను నిర్ణయించడానికి శుక్రవారం బీఏసీ సమావేశం నిర్వహించారు. నకిలీ ఓటరు ఐడీ నంబర్లు, మణిపూర్‌ ఘటన, పార్లమెంటరీ కమిటీల బిల్లులను పరిశీలనకు పంపాలన్న అంశాలపై చర్చించేందుకు సమయం కేటాయించాలన్న డిమాండ్‌పై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య భిన్నాభిప్రాయాలు రావడంతో ధన్‌ఖడ్‌ వాకౌట్‌ చేశారని ఓ విపక్ష నాయకుడు తెలిపారు. కాగా నకిలీ ఓటరు కార్డుల అంశం ఈ సమావేశంలో చర్చించలేదని రాజ్యసభ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - Mar 29 , 2025 | 06:06 AM