Share News

అభివృద్ధికి అందరూ సహకరించాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:35 AM

సీతంపే ట మండల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతిని ధులు అందరూ సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.

అభివృద్ధికి అందరూ సహకరించాలి

సీతంపేట రూరల్‌, మార్చి 28(ఆంధ్రజ్యోతి): సీతంపే ట మండల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతిని ధులు అందరూ సహకరించాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. శుక్రవారం స్థానిక వైటీసీ కేంద్రంలో ఎంపీపీ బి.ఆదినారాయణ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అభివృద్ధి పనుల పై అధికారులు ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని దోనుబాయి సర్పంచ్‌ కోటేశ్వరరావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో వెండర్‌ విధానంపై దృష్టి సారించాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రామాల్లో అభివృద్ధి పనులపై స్థానిక ప్రజాప్రతి నిధులకు సమాచారం ఇవ్వాలని, ప్రోటోకాల్‌ పాటించా లని ఆయన అధికారులకు సూచించారు. వెండర్‌ విధా నంపై సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గిరిజన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని సర్పంచ్‌ లు, ఎంపీటీసీలు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ప్రశ్నించా రు. అనంతరం రెవెన్యు, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షే మ ఇంజనీరింగ్‌, హౌసింగ్‌, విద్యుత్‌ తదితర శాఖలపై చర్చ నిర్వహించారు. సమావేశంలో మైక్‌లు మొరా యించడంతో ఎమ్మెల్యే తోపాటు సభ్యులు ఇబ్బందులు పడ్డారు. ఎంపీడీవో కె.గీతాంజలి, జడ్పీటీసీ సవర లక్ష్మి, వైస్‌ ఎంపీపీ కె.సరస్వతి, ఈవోపీఆర్డీ సత్యం పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:35 AM