Share News

Student Falls Ill పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి అస్వస్థత

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:56 PM

Student Falls Ill During Exam పదో తరగతి పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఈ సంఘటన సాలూరు మండలం బొడ్డవలస బీఆర్‌ అంబేడ్కర్‌ టెన్త్‌ పరీక్ష కేంద్రంలో జరిగింది.

Student Falls Ill   పరీక్ష రాస్తుండగా విద్యార్థినికి అస్వస్థత

సాలూరు రూరల్‌, మార్చి 28 ( ఆంధ్రజ్యోతి ): పదో తరగతి పరీక్ష రాస్తుండగా ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఈ సంఘటన సాలూరు మండలం బొడ్డవలస బీఆర్‌ అంబేడ్కర్‌ టెన్త్‌ పరీక్ష కేంద్రంలో జరిగింది. మామిడిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన కె.ప్రశాంతి శుక్రవారం బొడ్డవలస కేంద్రానికి చేరుకుంది. జీవశాస్త్రం పరీక్ష రాస్తుండగా.. అధిక ఎండో.. లేక ఒత్తిడో తెలియదు కాని చివరి నిమిషంలో అస్వస్థతకు గురైంది. దీంతో హుటాహుటిన బాలికను ప్రథమ చికిత్స చేసి 108 వాహనంలో సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేయడంతో తేరుకున్న బాలికను ఇంటికి పంపించారు.

Updated Date - Mar 28 , 2025 | 11:56 PM