చికిత్స పొందుతూ ఉపాధ్యాయుడి మృతి
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:36 AM
స్థానిక గ్రోత్ సెంటరు సమీపంలో ఈనెల 4న ఆటో ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్ర భుత్వ ఉపాధ్యాయుడు పూసర్ల విశ్వేశ్వరరావు(54) విశాఖపట్టణంలోని ప్రైవే ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

బొబ్బిలి/రామభద్రపురం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రోత్ సెంటరు సమీపంలో ఈనెల 4న ఆటో ఢీకొన్న ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్ర భుత్వ ఉపాధ్యాయుడు పూసర్ల విశ్వేశ్వరరావు(54) విశాఖపట్టణంలోని ప్రైవే ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. రామభద్రపురం గ్రామానికి చెందిన విశ్వేశ్వరరావు బొబ్బిలి జడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈనెల 4న సాయంత్రం బొబ్బిలి వచ్చి తిరిగి బైకుపై వెళ్తుండ గా నారాయణప్పవలస గ్రామానికి చెందిన ఆటో ఢీకొంది. దీంతో ఆయన తీవ్ర గా యాలపాలయ్యారు. బైకుపై వెనుక కూర్చొన్న విశ్వేశ్వరరావు రోడ్డుపక్కన ఆగి వాహనం దిగినప్పుడు ఆటో వచ్చి బలంగా ఢీకొన్నట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన విశ్వేశ్వరరావును స్థానిక సీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం విశాఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు ఎస్‌ఐ జ్ఞానప్రసాద్ అప్పగించారు. మృతుడికి భార్య లలిత, కుమారుడు దివాకర్, కుమార్తె రమణి ఉన్నారు. విశ్వేశ్వరరావు ఆకస్మిక మృతిపై రామభద్రపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.