Share News

వంతెన పూర్తిచేయడమే లక్ష్యం

ABN , Publish Date - Mar 20 , 2025 | 12:07 AM

భోజరాజపురం వంతెన వచ్చే ఏడాది మే కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీ జేఈ రుక్మాంగద నాయుడు తెలిపారు.భోజరాజపురానికి వంతెన నిర్మాణం కోసం గతంలో మంజూరైన 15 కోట్లతో మునిసిపల్‌ ప్రధాన వాటర్‌వర్క్స్‌ పక్క నుంచిపనులను ప్రారంభించినట్లు చెప్పారు.

  వంతెన పూర్తిచేయడమే లక్ష్యం
వేగావతి నది సమీపంలో కొలతలు తీస్తున్న అధికారులు:

బొబ్బిలి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): భోజరాజపురం వంతెన వచ్చే ఏడాది మే కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పంచాయతీ జేఈ రుక్మాంగద నాయుడు తెలిపారు.భోజరాజపురానికి వంతెన నిర్మాణం కోసం గతంలో మంజూరైన 15 కోట్లతో మునిసిపల్‌ ప్రధాన వాటర్‌వర్క్స్‌ పక్క నుంచిపనులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ మేరకు మున్సిపల్‌ వాటర్‌వర్క్స్‌కు చెందిన ఎనిమిది సెంట్లు అవసరం కావడంతో బుధవారం కమిషనరు, ఇతర అధికారులతో జేఈ చర్చించి, వారి సమక్షంలో కొలతలు తీసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో వంతెన నిర్మాణం కోసం శంకుస్థానన జరిగిందని, సుమారు రూ. 5 కోట్లు పనులు జరగ్గా, రూ.2 కోట్ల బిల్లులను చెల్లించినట్లు తెలిపారు. గొర్లెసీతారాంపురం జంక్షన్‌ రాష్ర్టీయ రహదారి నుంచి సుమారు రెండుకిలోమీటర్ల పొడవున రోడ్డుతో కూడిన వంతెన నిర్మిస్తున్నామని చెప్పారు. వంతెనకు ఇరు వైపులా, రామభద్రపురం మండలం వరకు ఈ అప్రోచ్‌ రోడ్డు ఉంటుందని తెలిపారు. పనులు జరిగిన మేరకు బిల్లుల కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. మునిసిపాలిటీకి చెందిన ఎనిమిది సెంట్ల స్థలాన్ని అప్పగించాలని పాలకవర్గాన్ని, అధికారులను అడిగామని జేఈ తెలిపారు. అనుమతి వచ్చిన వెంటనే ట్రాన్స్‌ఫార్మర్‌, ప్రహరీలను తొలగించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కమిషనరు రామలక్ష్మి తదితరులతో చర్చించామని తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 12:07 AM