Share News

దళితుల పక్షపాతి చంద్రబాబు

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:16 AM

దళితు ల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని పార్వ తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.

దళితుల పక్షపాతి చంద్రబాబు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే విజయచంద్ర

పార్వతీపురం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): దళితు ల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు అని పార్వ తీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ జరిగి తీరాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణపై 30ఏళ్ల పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశా రన్నారు. ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదా లు తెలుపుతున్నట్టు చెప్పారు. జంబూ దీపాన్ని పాలించిన వ్యక్తి దళితుడని, వివాహాలు జరిగిన తర్వాత చూసే అరుణజ్యోతి నక్షత్రం దళిత బిడ్డ అని తెలిపారు. కృష్ణుని మూడో భార్య, జాంబవంతుని కుమార్తె దళిత బిడ్డని గుర్తు చేశారు. దళితులకు చెందిన కొన్ని కులాల్లో యూనివర్శిటీ మెట్లు ఎక్కని వారు ఉన్నారని, ఆ కులాల్లో ఒక డాక్టర్‌ లేరని, ఉన్నత ఉద్యోగులు లేరన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:16 AM