Share News

ఒక విడతలో మూడు సమావేశాలు

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:30 AM

బొబ్బిలి మున్సి పాలిటీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రత్యేకత చోటుచేసు కుంది.

ఒక విడతలో మూడు సమావేశాలు
సమావేశంలో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల వాగ్వాదం

బొబ్బిలి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సి పాలిటీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రత్యేకత చోటుచేసు కుంది. చైర్మన్‌ సావు వెంకటమురళీకృష్ణారావు అధ్యక్షత న శనివారం ఏకంగా 61 అంశాల అజెండాతో ఒకే విడ తలో మూడు సమావేశాలు జరిపించి మమ అనిపించా రు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా వరుసగా రెండు నెలల కౌన్సిల్‌ సమావేశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. ఫలితంగా 31 వార్డులలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యం లో శనివారం ఒక సాఽధారణ సమావేశం, రెండు అత్యవ సర సమావేశాల పేరుతో అజెండాలోని 61 అంశాలకు పాలకవర్గ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసేశారు. అజెండా అంతా చర్చించాలంటే చాలా సమ యం పడుతుందన్న ఉద్దేశంతో ఇరు పార్టీల కౌన్సిలర్లు ఏకమై ముఖ్యమైన అంశాలను చర్చించాలని ఏకాభిప్రా యానికి వచ్చారు. ఈ సమయంలో జరిగిన చర్చల్లో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం జరిగింది. పలు వార్డులలో కుళాయి కనెక్షన్లు లేకుండానే కుళాయి పన్నులు చెల్లించాలని నోటీసులు పంపి ఒత్తిడి చేయ డం పట్ల టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు రాంబార్కి శరత్‌బా బు, బొత్స రమణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధి కారికంగా ఎటువంటి పన్నులు చెల్లించకుండానే వంద లాది అక్రమ కుళాయిలు ఉన్నాయని కౌన్సిలర్లు ఆరోపిం చారు. మరో సీనియర్‌ కౌన్సిలరు తెంటు పార్వ తి కలుగజేసుకొని గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 200 రూపాయల కుళాయి కనెక్షన్లు ఇచ్చారని, వాటికి ఇవ్వాల్సిన నోటీసులు కుళాయిలు లేని వారికి కూడా ఇచ్చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశీలించాలని కౌన్సిలర్లు డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే బేబీనాయన ప్రతిపా దించిన అంశాలపై నిర్లక్ష్యం చేయడం పట్ల రాంబార్కి అభ్యంతరం వ్యక్తం చేశారు. లైబ్రరీ పనులు పూర్తయినా దానికి ఎందుకు ఓపెనింగ్‌ పెట్టడం లేదని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ కారణంగా ఆలస్యం అయింద న్నారు. దీనిపై వైసీపీ కౌన్సిలరు ఇంటి గోవిందరావు సమాధానం ఇస్తుండగా టీడీపీ కౌన్సిలర్లు కింతలి శ్రీదేవి, రాంబార్కి అభ్యంతరం చెప్పడంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటుచేసుకుం ది. వైస్‌చైర్మన్‌ చెలికాని జోక్యంతో సద్దుమణిగింది. ఇంకా అనేక ప్రజా సమస్యలను కౌన్సిలర్లు లేవనెత్తారు. అజెండాలో 61 అంశాలు ఉన్నప్పటికీ అన్నిటికీ ఆమో దం తెలిపి, సమావేశాన్ని ముగించారు. సమావేశపు హాలులో మైకులు పలు దఫాలు మొరాయించాయి. అలాగే సరిపడినన్ని కుర్చీలు కూడా లేవు. ఓ మహిళా కౌన్సిలరు కుర్చీ కోసం కొంతసేపు నిలబడాల్సి వచ్చింది. దీనిపై చైర్మన్‌.. అధికారులను నిలదీశారు. ఈ సమా వేశంలో కమిషనర్‌ లాలం రామలక్ష్మి, మేనేజరు దీక్షితు లు, డీఈఈ కిరణ్‌కుమార్‌, ఏఈ గుప్త, ఆర్వో నాగరా జు, టీపీఆర్వో జగన్మోహన్‌, ఆర్‌ఐ సురేష్‌బాబు, శానిటరీ ఇన్‌స్పెక్టరు మురళి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 30 , 2025 | 12:30 AM