Walking... Climbing Hills... నడిచి.. కొండ ఎక్కి..
ABN , Publish Date - Mar 21 , 2025 | 11:53 PM
Walking... Climbing Hills... టీకే జమ్ము పంచాయతీ కూటం గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాల్సిందేనని మండల విద్యాశాఖాధికారులు ధనుకొండ గౌరునాయుడు, ముదిలి శ్రీనివాసరావు తేల్చారు. ‘అడవిలో.. ఆరు కిలో మీటర్లు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు.

ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ
పాఠశాల ఏర్పాటు చేయాల్సిందేనని వెల్లడి
ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన
జియ్యమ్మవలస, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): టీకే జమ్ము పంచాయతీ కూటం గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయాల్సిందేనని మండల విద్యాశాఖాధికారులు ధనుకొండ గౌరునాయుడు, ముదిలి శ్రీనివాసరావు తేల్చారు. ‘అడవిలో.. ఆరు కిలో మీటర్లు’ శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’లో వెలువడిన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో శుక్రవారం మఽధ్యాహ్నం ఎంఈవోలు గోర్లి నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి.. రెండు కిలోమీటర్లు కొండెక్కి కూటం గ్రామానికి చేరుకున్నారు. విచారణలో భాగంగా గ్రామస్థులతో మాట్లాడారు. గ్రామంలో పిల్లలు పడుతున్న బాధలను గిరిజనులు వివరించారు. కూటం గ్రామంలో గిరిజన సంక్షేమశాఖ కాని, మండల పరిషత్ గాని కచ్చితంగా పాఠశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పూర్తి నివేదికను జిల్లా అధికారులకు అందిస్తామన్నారు.
ఎంఈవో-2కు ప్రమాదం
విచారణ నిమిత్తం కూటం గ్రామానికి వెళ్లిన ఎంఈవో-2 ముదిలి శ్రీనివాసరావుకు ప్రమాదానికి గురయ్యారు. తిరుగు ప్రయాణంలో ఆయన కాలు జారి కింద పడిపోవడంతో చేయి విరిగి పోయింది. సమాచారం అందుకున్న సీఆర్‌పీలు ఆయనను అతి కష్టం మీద ఆర్‌ఆర్‌బీ పురంలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ ప్రఽథమ చికిత్స చేసిన అనంతరం ఆయన్ని పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.