AP Weather: ఎండలు పిడుగులు
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:40 AM
రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు రెండురోజులు కొనసాగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది

రాష్ట్రంలో మరో రెండ్రోజులు భిన్నవాతావరణం
అమరావతి, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండలు, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. శుక్రవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో పాటు మోస్తరు వర్షాలు, శనివారం అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది.