ఆ.. పిల్లలు ఎక్కడ ఉన్నారు?
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:25 AM
బడికిరాని పిల్లలంతా బాల కార్మికులే.. విద్యా హక్కు చట్టంలో ఇదో ప్రధానాంశం.

డ్రాప్‌బాక్సులో 20వేలమందికిపైగా బాలలపై ఆరా
మళ్లీ బడిలో చేర్చేందుకు ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్
ఏలూరు అర్బన్, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : బడికిరాని పిల్లలంతా బాల కార్మికులే.. విద్యా హక్కు చట్టంలో ఇదో ప్రధానాంశం. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్స రంలో నమోదైన బాలబాలికల్లో బడికిరాని పిల్లలు 20,486 మందిగా ఆయా మండలాల్లో పాఠశాలల వారీగా డ్రాప్‌బాక్సుల్లో అధికారికం గా నమోదైన బాలలు వీరంతా. పాఠశాలలో ఒకసారి అడ్మిషన్ తీసుకుని కొన్నిరోజులపాటు తరగతులకు హాజరైన అనంతరం ఇక కంటిన్యూగా బడికి హాజరుకాని విద్యార్థులను ఇలా ఆన్‌లైన్ డ్రాప్‌బాక్సులో హెచ్‌ఎంలు చేరు స్తారు. వీరిలో కొందరు ఇతర పాఠశాలల్లో అడ్మిషన్ తీసుకోవాలన్నా, అంతకు ముందు చదివిన పాఠశాల హెచ్‌ఎం డ్రాప్‌బాక్సు నుంచి పేరును తొలగిస్తేనే కొత్తస్కూలులో అడ్మిషన్‌కు అవకాశం ఉంటుంది. కానీ జిల్లా లో ఇప్పటికీ 20 వేల మందికి పైగా బాల బాలికలు డ్రాప్‌బాక్సులోనే కొనసాగుతుండ డానికి కారణాలను తెలుసుకోవడంతోపాటు, వారందరినీ ప్రత్యక్షంగా కలుసుకుని మళ్లీ బడికి రప్పించ డానికి ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధి కారులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ ఆదేశాలకు ముందుగానే రాష్ట్ర అధి కారులు పంపిన డ్రాప్‌బాక్సు విద్యార్థుల వివ రాల ప్రకారం మండల విద్యాధికారులు క్షేత్ర స్థాయి నుంచి తెప్పించుకున్న సమాచారం ప్రకారం సంబంధిత విద్యార్థులు బడిమానేయ డానికి ఉన్నతాధికారులు పంపిన ఫార్మేట్‌లోని పది కారణాల నుంచి ఏదో ఒకదానిని నమో దు చేశారు. ఈ వివరాలతో సంతృప్తి చెందని ఉన్నతాధికారులు సంబంధిత డ్రాప్‌బాక్సు విద్యార్థుల ఇళ్లకే వెళ్లి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి మళ్లీ బడిలో చేర్పించమే కాకుండా ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు.
నెలాఖరులోగా ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ పూర్తి
ప్రస్తుతం జరుగుతున్న పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మేరకు ఐదు రకాల బడు ల్లో సంబంధిత తరగతుల విద్యార్థులను ముందుగా మ్యాపింగ్, షిఫ్టింగ్ పూర్తిచేసిన అనంతరం డ్రాప్‌బాక్సులో వున్న బాలబాలి కలను గుర్తించి వారిని బడిలో చేర్పించ డానికి ఏప్రిల్ రెండోవారంలో ప్రత్యేక ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్‌ను జిల్లావ్యాప్తంగా నిర్వహించడానికి నిర్ణయించారు. స్పెషల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహణలో పాఠశా లల హెచ్‌ఎంలు, టీచర్లు, అంగన్‌వాడీ, సచి వాలయ సిబ్బంది, సీఆర్పీలు బృందాలుగా ఏర్పడి విద్యార్థుల ఇళ్లకువెళ్లి మళ్లీ బడిలో చేర్చేందుకు ప్రయత్నిస్తారు. బడి ఈడుగల పిల్లలందరూ బడిలో ఉండేలా చేయడమే దీని ముఖ్యోద్దేశ్యమని సమగ్రశిక్ష జిల్లా అధికారులు వివరించారు.