ఖజానాకు గండి
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:16 AM
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతోంది.

జిల్లాలో గనుల ఆదాయం లక్ష్యం రూ.143.11 కోట్లు
వసూలైంది రూ.110 కోట్లు
పర్యవేక్షణలేమి.. రూ.30 కోట్ల వెనుకంజ
అక్రమార్కులకు అధికారుల అండ!
జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఖనిజ సంపద అక్రమంగా తరలిపోతోంది. మైనింగ్ శాఖ జిల్లా అధికారుల తనిఖీలు అంతంతమాత్రం కావడంతో అక్రమార్కులు గ్రావెల్‌ను యథేచ్ఛగా తరలిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. ఎర్ర మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఇళ్లకు మెరక పేరిట గ్రావెల్‌ను అందిన కాడికి తవ్వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమార్కులకు అడ్డుకునే వారే కరువయ్యారు.
(ఏలూరు– ఆంధ్రజ్యోతి)
క్వారీ నిర్వహణకు మైనింగ్‌శాఖ, పర్యావరణ శాఖ(ఈసీ), కాలుష్య నియంత్రణ మండలితో పా టు సీఎఫ్‌ఈ, సీఎఫ్‌వో అనుమతులు తీసుకోవాలి. రవాణాకు సంబంధించిన పర్మిట్లు తీసుకుని తవ్విన ఖనిజం తరలించుకోవాలి. అవేమి లేకుండా దెందు లూరు, ఉంగుటూరు నియోజకవ ర్గాల్లో పలు గ్రామాల్లో కొందరు పొలాల్లో 15 అడుగుల లోతుకు ఎక్స్‌వేటర్లతో తవ్వి రెండు జిల్లాలకు సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చింతలపూడి, నూజివీ డు, చాట్రాయి, కొయ్యలగూడెం, టి.నరసా నరసాపు రంలో యథేచ్ఛగా అక్రమ క్వారీయింగ్ జరుగుతోం ది. ఇసుక రీచ్‌ల ఏర్పాట్లతో అధికారులు క్యాంపులకు వెళ్లిపోవడంతో నిఘా కొరవడింది. కిందిస్థాయిలో క్వారీల్లో అక్రమాలకు బడాబాబులు తెరతీస్తున్నారు. ఇప్పుడు వేసవి సీజన్‌లో ఇళ్ల నిర్మాణాలకు గ్రావెల్, ఇతర మెటల్స్ అవసరాలకు డిమాండ్ ఉంది.
సొంత లాభం కోసం..
వైసీపీ ప్రభుత్వంలో అధికారులు చూసీచూడన ట్లు వ్యవహరించారు. ఇప్పుడు కూడా అదే వ్యవహా ర శైలితో సొంత లాభం చూసుకోవడంతో ప్రభుత్వా దాయానికి గండి పడుతోందని విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. కిందిస్థాయిలో సిబ్బంది కొందరు అధికా రులకు మామూళ్లు ఎర చూపించి క్షేత్రస్థాయికి వెళ్లనీయకుండా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఖనిజాన్ని బట్టి క్యూబిక్ మీటరుకు రూ.100 నుంచి రూ.220 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉంది. అక్రమ మైనింగ్‌తో ఈ ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేర డం లేదు. ఈ ఏడాది మైనింగ్ శాఖ ద్వారా జిల్లాలో రూ.143.11 కోట్లు ఆదాయం లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం రూ.110.13 కోట్లే లభించింది. ఇక రూ.30 కోట్ల పైమాటే వసూళ్లు కావాల్సి ఉంది. ఇదీ వసూలు కావడం అనుమానమే. దీనికి ప్రధాన కార ణం అక్రమాల నిరోధం పేరిట ప్రభుత్వం కొద్దికాలం పర్మిట్లు నిలిపివేయగా, ఇతర మైన్ల నుంచి అఽధికారు లు రాయల్టీని వసూలు చేయడంలో చేతివాటం చూపారని ప్రచారం జరుగుతోంది. జిల్లాలో ద్వారకా తిరుమలలో బాల్ క్లే, కొయ్యలగూడెం, చింతలపూడి, చాట్రాయి మండలాల్లో రోడ్డు మెటల్, భీమఢోలు, ఉంగుటూరు, టి.నరసాపురం, చాట్రాయి, ముసునూ రులో గ్రావెల్ క్వారీలు ఉన్నాయి. ఇవే ప్రధాన ఆదాయ వనరులుగా గనులశాఖ చూపిస్తోంది. మిగిలిన మండలాల్లో గనులను పర్యవేక్షించకుండా గాలికొదిలేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒక అధికా రి కొద్ది నెలల్లో ఉద్యోగ విరమణ చేయనుండడంతో అక్రమ క్వారీయింగ్‌ను చూసీచూడనట్లు వ్యవహరి స్తున్నారన్న ఆరోపణలున్నాయి. కీలకమైన రాయల్టీ ఇన్‌స్పెక్టర్ డిప్యూటేషన్‌పై విజయవాడ డైరెక్టర్ కా ర్యాలయంలో పనిచేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. ఈ పోస్టులో కాంట్రాక్టు పద్ధతిలో రిటైర్డు ఉద్యోగితో పనులు చేయిస్తున్నారు. ఈ విషయాలపై గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ రవికుమార్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబా టులో లేరని సిబ్బంది చెబుతున్నారు.